పట్టించుకోని పంచాయతీ సిబ్బంది | - | Sakshi
Sakshi News home page

పట్టించుకోని పంచాయతీ సిబ్బంది

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

చర్యలు తీసుకుంటాం..

వెంకటాపురం(కె): గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు మెరుగుపర్చాలనే లక్ష్యంతో నిర్మించిన శ్మశానవాటికలు అధికారుల నిర్లక్ష్యం, సరైన నిర్వహణ లేకపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. 2018, 19 ఆర్థిక సంవత్సరంలో ఉపాధి హామీ పథకంలో ఒక్కొక్క శ్మశాన వాటిక నిర్మాణానికి రూ.12 నుంచి రూ.15లక్షల వరకు వెచ్చించారు. దహన సంస్కారాలకు ప్రత్యేక స్థలంతో పాటు స్నానాలు చేయడానికి, దుస్తులు మార్చుకోవడానికి గదులు నిర్మించారు. ప్రారంభంలో కొంత బాగానే ఉన్నప్పటికీ రానురాను అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్మాణాలు దెబ్బతింటూ వస్తున్నాయి. పైగా నిర్మాణాల్లో నాణ్యత లేకపోవడంతో వాజేడు మండలంలోని జగన్నాథపురం వైకుంఠదామం ఇప్పటికే కూలిపోయింది. చాలా చోట్ల గోడలు దెబ్బతింటున్నాయి.

కనీస సౌకర్యాలు కరువు

జిల్లాలోని 171 గ్రామ పంచాయతీల్లో చాలా పంచాయతీల్లోని శ్మశాన వాటికల్లో నీరు, విద్యుత్‌, విద్యుత్‌ సౌకర్యం లేకపోవడంతో అంత్యక్రియలకు వచ్చిన వారు, వారి బంధువులు కనీసం కాళ్లు, చేతులు కడుక్కునేందుకు నీరు లేక ఇబ్బందుతులు పడుతున్నారు. సమీపంలోని వాగులు, పంట పొలాల వద్దకు వెళ్లి స్నానాలు చేయాల్సి దుస్థితి నెలకొంది. కొంతమంది వాటర్‌ ట్యాంకర్లు తెప్పించుకోవాల్సి వస్తుంది. ఇక రాత్రి సమయాల్లో ఎవరైన చనిపోతే చీకట్లోనే దహన సంస్కారాలు చేయాల్సి వస్తుందని, పాములు, తేళ్ల భయంతో బిక్కుబిక్కు మంటూ అంత్యక్రియల కార్యక్రమాల్లో పాల్గొనాల్సి వస్తుందని పలువురు వాపోతున్నారు.

జిల్లాలోని శ్మశాన వాటికల్లో సౌకర్యాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటాం. విద్యుత్‌, నీటి సౌకర్యం ఏర్పాటు చేసేలా పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులను ఆదేశిస్తాం. నీటి సౌకర్యం లేని శ్మశాన వాటికల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తాం.

– డీపీఓ వెంకయ్య

శ్మశాన వాటికల నిర్వహణను అధికారులు గాలికి వదిలేశారు. స్థానికంగా ఉండే పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోవడంతో రేకులు లేచిపోవడం, గోడలు కూలటం, గదులు శుభ్రం చేయపోవడంతో పాటు పిచ్చిమొక్కలు, చెత్తాచెదారంతో పేరుకుపోయి ఉన్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి జిల్లాలోని శ్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement