‘రామప్ప’ను సందర్శించిన సినీనటుడు చంద్రశేఖర్‌ | - | Sakshi
Sakshi News home page

‘రామప్ప’ను సందర్శించిన సినీనటుడు చంద్రశేఖర్‌

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

వెంకటాపురం(ఎం): మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని శుక్రవారం సినీనటుడు చంద్రశేఖర్‌ (చత్రపతి శేఖర్‌) దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీష్‌ శర్మ, ఉమాశంకర్‌లు వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌కుమార్‌ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కాకతీయుల చరిత్ర గురించి వివరించారు. అనంతరం రా మప్ప చెరువును సందర్శించి బోటింగ్‌ చేశారు. వారి వెంట ఈఓ ఇమ్మడి భాస్కర్‌, టూరిస్ట్‌ పోలీసులు, అరుణ్‌, శ్రీకాంత్‌, బద్రు, శ్రీని వాస్‌, వివిధ శాఖల సిబ్బంది ఉన్నారు.

రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ములుగు రూరల్‌: వాహనదారులు రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్‌ రామ్నాథ్‌ కేకన్‌ శుక్రవారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇసుక లారీలు అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, అక్రమ పార్కింగ్‌పై కఠినంగా చర్యలు ఉంటాయన్నారు. డ్రైవర్లు నిబంధనలు ఉల్లంఘిస్తే వాహన యజమానులదే బాధ్యతన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే వారి సమాచారం అందుబాటులో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు అందించాలన్నారు. జనావాస ప్రాంతాల్లో ప్రధాన రహదారుల వద్ద, కూడళ్ల, పాఠశాలల వద్ద అప్రమత్తంగా వాహనాలను నడపాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే సీజ్‌ చేస్తామన్నారు. ప్రమాదాలను నివారించడమే జిల్లా పోలీస్‌శాఖ ప్రధానలక్ష్యమన్నారు.

ముగిసిన

బొడ్డెమ్మ సంబురాలు

మంగపేట: జిల్లాలోని వివిధ గ్రామాల్లో తొమ్మిది రోజుల పాటు సాగిన బొడ్డెమ్మ సంబురాలు శుక్రవారం ముగిశాయి. మంగపేట మండలంలోని కమలాపూరం, బోరునర్సాపు రం, రాజుపేట తదితర గ్రామాల్లో మహిళలు, యువతులు, చిన్నారులు పీటపై బొడ్డెమ్మను పేర్చి ఆడిపాడారు. అనంతరం బొడ్డెమ్మను పవిత్ర గోదావరిలో నిమజ్జనం చేశారు.

టైపిస్ట్‌ పోస్టుకు

దరఖాస్తుల ఆహ్వానం

ములుగు: జిల్లాలో అత్యాచార, పోక్సో చట్టం కేసుల సత్వర విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానంలో ఒప్పంద ప్రాతిపదిక న టైపిస్టు పోస్టును భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూర్య చంద్రకళ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు డిగ్రీ, తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలని, టైప్‌రైటింగ్‌లో ఉన్నత శ్రేణి పరీక్ష, దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలన్నారు. కంప్యూటర్‌ నిర్వహణలో పరిజ్ఞానం, అర్హత కలిగి ఉండాలని తెలిపారు. నెలకు రూ.19,500 వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్హతలు, సాంకేతిక అర్హతలు, పుట్టిన తేదీ, వర్తించే సామాజిక వర్గ ధ్రవపత్రం, స్థానికతకు సంబంధించిన ధ్రువపత్రాల ప్రతులను జతచేయాలని సూ చించారు. పూర్తిచేసిన దరఖాస్తులను జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా ప్రధాన న్యాయస్థానం, ములుగు చిరునామాకు స్పీడ్‌ పోస్టు, కొరియర్‌ ద్వారా ఈ నెల 22న సాయంత్రం 5 గంటలోపు పంపించాలన్నారు.

నేడు ఓపెన్‌ కాస్ట్‌కు

వ్యతిరేకంగా నిరసన ర్యాలీ

ములుగు: రామప్ప దేవాలయాన్ని పరిరక్షించా లనే డిమాండ్‌తో సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మానవ హక్కుల వేదిక ఉమ్మడి వరంగల్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శనివారం నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మండలంలోని జంగాలపల్లి వద్ద ఉదయం ర్యాలీ ప్రారంభం కా నుందని, వెంకటాపూర్‌ మీదుగా పాలంపేట శివారు వరకు సాగి, అనంతరం రామప్ప దేవా లయం వద్దకు చేరుకోనున్నట్లు వివరించారు. రామప్ప వారసత్వ సంపదను కాపాడుకోవా ల్సిన ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు ప్రతిపాదిత బొగ్గు తవ్వకాల ప్రాజెక్టుపై నిరసనను తెలియజేయడమే ర్యాలీ ఉద్దేశమన్నారు. మానవ హక్కుల వేదిక సభ్యులు, ప్రజలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement