నేడు ఎంగిలిపూల బతుకమ్మ | - | Sakshi
Sakshi News home page

నేడు ఎంగిలిపూల బతుకమ్మ

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

– 8లోu

ప్రజా సంక్షేమమే ధ్యేయం
ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ములుగు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి అన్నారు.
వాతావరణం
జిల్లాలో ఉదయం మంచుకురుస్తుంది. మధ్యాహ్నం ఎండ ఎక్కువగా ఉంటుంది. సాయంత్రం చల్లగాలులు వీస్తాయి.

● పూల సేకరణలో మహిళలు

● పల్లెల్లో తొమ్మిది రోజులపాటు సందడి

ములుగు: తీరొక్క పూలను పేర్చి.. ప్రకృతిని ఆరాధిస్తూ.. ఆడబిడ్డలంతా ఒక్కటై ఆటపాటలతో జరుపుకునే బతుకమ్మ పండుగ నేడు జిల్లాలో ప్రారంభం కానుంది. వివిధ రకాల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, వాటి చుట్టూ చేరి పాటలు పాడుతూ సంబురాలు చేసుకునేందుకు మహిళలు సిద్ధమవుతున్నారు. నేటినుంచి (శనివారం) బతుకమ్మ వేడుకలు ప్రారంభం కానుండటంతో జిల్లాలో పండుగ సందడి మొదలైంది. తంగేడు, గునుగు, బంతి, గుమ్మడి పూలు, సీతజడ, టేకు పువ్వు తదితర పూల సేకరణలో మహిళలు నిమగ్నమయ్యారు.

పూలదే ప్రత్యేక స్థానం..

బతుకమ్మ పండుగలో పూలదే ప్రధాన పాత్ర. ప్రకృతి ఒడిలో సహజసిద్ధంగా పూసే పూలతో బతుకమ్మను పేర్చడం ఈ పండుగ ప్రత్యేకత. పసుపు వర్ణంలో మెరిసే తంగేడు పూలు బతుకమ్మలో కీలకంగా నిలుస్తాయి. గునుగు పూల ఆకృతులు బతుకమ్మకు మరింత అందాన్ని అద్దుతాయి. బంతి, గుమ్మడి, సీతజడ, టేకు పూలు తమ రంగులతో పూల సౌందర్యాన్ని మరింత పెంచి బతుకమ్మలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అడవులు, పొలాలు, గుట్టలు, చెరువుల పరిసరాల్లో లభించే పూలను ఇంటిల్లిపాది సేకరించి, ఒక్కొక్క వరుసగా పూలను పేర్చి బతుకమ్మను మహిళలు రూపొందిస్తారు.

జిల్లాలో ఏర్పాట్లు పూర్తి

జిల్లాలోని 171 గ్రామపంచాయతీలతో పాటు ములుగు మున్సిపాలిటీ పరిధిలో బతుకమ్మ వేడుకలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా గ్రామాల్లోని ఆలయాల వద్ద మహిళలు 9రోజుల పాటు బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలాడుతారు. 9వ రోజున సద్దుల బతుకమ్మ ఊరి చివరన పెద్ద ఎత్తున మహిళలు ఆడి అనంతరం సమీపంలోని చెరువు, కుంటల్లో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. బతుకమ్మ ఆడే ఆలయాల వద్ద గ్రామపంచాయతీ పాలకవర్గాలు, అధికారులు విద్యుత్‌ లైట్లను ఏర్పాటు చేశా రు. తాగునీటి వసతితో పాటు మహిళలు ఇబ్బందులు పడకుండా కనీస సౌకర్యాలు కల్పించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో బందోబస్తు నిర్వహించేందుకు పోలీసు శాఖ సన్నద్ధమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement