ఉచిత మొబైల్‌ ఏఐ చెస్ట్‌ ఎక్స్‌రే స్క్రీనింగ్‌ | - | Sakshi
Sakshi News home page

ఉచిత మొబైల్‌ ఏఐ చెస్ట్‌ ఎక్స్‌రే స్క్రీనింగ్‌

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

ఏటూరునాగారం: మండలంలోని చెల్పాక గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం జిల్లా క్షయ నియంత్రణ కార్యక్రమం ఎన్‌టీఈపీ ఆధ్వర్యంలో ఉచిత మొబైల్‌ ఏఐ చెస్ట్‌ ఎక్స్‌రే స్క్రీనింగ్‌ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ వేణుగోపాల్‌ తెలిపారు. ఈ సందర్భంగా చెల్పాక సర్పంచ్‌ రాంబాబు మాట్లాడుతూ టీబీ వ్యాధి ఉన్న వ్యక్తులు వెంటనే చికిత్సలు పొంది నయం చేసుకోవాలన్నారు. మొత్తం 82 మంది అనుమానితులకు ఉచిత మొబైల్‌ ఏఐ ఆధారిత చెస్ట్‌ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించగా ప్రాథమిక స్క్రీనింగ్‌లో ముగ్గురు అనుమానితులను గుర్తించి, తదుపరి నిర్ధారణ పరీక్షల కోసం జిల్లా కేంద్రానికి పంపించారు. ఈ కార్యక్రమంలో నర్సింగ్‌ అధికారిణి పద్మ, ఏఎన్‌ఎం ఆదిలక్ష్మి, హెల్త్‌ అసిస్టెంట్‌ జైలుబాబు, నాగేశ్వర్‌రావు, ఎలైట్‌ ఇండియా ప్రతినిధి రాజు, ఎక్స్‌రే టెక్నీషియన్‌ సంతోష్‌, కమ్యూనిటీ మొబిలైజర్‌ విజయ్‌కుమార్‌, ఆశకార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement