ఏటూరునాగారం: గొత్తికోయ గూడేల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్‌లు తీయడం నిలిపివేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఎండీ.దావూద్ హెచ్చరించారు. గురువారం మండలంలోని గొత్తికోయ గుడేలకు చెందిన గొత్తికోయలు ఐటీడీఏ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఐటీడీఏలోని ఎస్‌డీసీ గంట ప్రతాప్, డీడీ దబ్బకట్ల జనార్దన్‌కు వినతి పత్రం ఇచ్చారు. అనంతరం ఐటీడీఏ నుంచి సబ్ డీఎఫ్‌ఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి అక్కడ కూడా ధర్నా నిర్వహించి ఫారెస్ట్ రేంజర్ ట్రైనింగ్ ఐఎఫ్‌ఎస్ ప్రతిమిష్ కేశవ, డీఆర్‌ఓ అప్సరున్నిసా బేగంకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం కలెక్టర్, డీఎఫ్‌ఓతో ఫోన్‌లో మాట్లాడి ధర్నా విరమించారు. కార్యక్రమంలో టీఎల్ రవి, మండల కమిటీ సభ్యుడు తోలెం కృష్ణయ్య, మండల నాయకులు సమ్మయ్య సురేశ్, దేవయ్య, జోగయ్యతో పాటు 60 మంది పాల్గొన్నారు.


