వెంకటాపురం(కె): వెంకటాపురం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం మధ్యాహ్నం 3 గంటకు ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ దివాకర గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ఆధ్వర్యంలో ఈ ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో నేరుగా ప్రజల సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కార మార్గం చూపుతారన్నారు. వెంకటాపురం, వాజేడు, మంగపేట, కన్నాయిగూడెం, ఏటూరునాగారం మండలాలకు చెందిన ఫిర్యాదుదారులు తమ స్థానిక సమస్యలు, ప్రభుత్వ పథకాల సంబంధించిన విన్నపాలు అధికారుల దృష్టికి తీసుకురావొచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్జీదారులు వినియోగించుకోవాలని కోరారు. ప్రజాదర్బార్‌కు వచ్చే అర్జీదారులకు అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ అధికారును ఆదేశించారు. ఎస్పీ, డీఎఫ్‌ఓ, ఆర్డీఓ, అన్ని శాఖల జిల్లా అధికారులు ఐటీడీఏ ఏటూరునాగారం కార్యాలయ అధికారులు సంబంధిత తాహసీల్దార్లు, ఎంపీడీఓలు, ఎంపీఓలు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.
తైబజార్ వేలం ఆదాయం రూ.10.85 లక్షలు
ములుగు: ములుగు మున్సిపాలిటీ పరిధి తైబజార్ బహిరంగ వేలంలో రూ.10.85 లక్షల ఆదాయం సమకూరినట్లు మున్సిపల్ కమిషనర్ రమేశ్ తెలిపారు. గురువారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన వేలంలో ముగ్గురు పాల్గొనగా.. సాజిద్ తైబజార్‌ను దక్కించుకున్నట్లు వెల్లడించారు. ఆర్థిక సంవత్సరం 2026–27 ఆర్థిక సంవత్సరానికి ఈ వేలం వర్తిస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, వైస్ చైర్‌పర్సన్ ఆసియా షాహీన్, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, సెక్షన్ క్లర్క్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్‌కు టీఎన్జీఓ
నాయకుల శుభాకాంక్షలు
ములుగు రూరల్: ములుగు కలెక్టర్ టీఎస్ దివాకరకు టీఎన్జీఓ సంఘం నాయకులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు గురువారం సంఘం ములుగు జిల్లా అధ్యక్షుడు పోలు రాజు ఆధ్వర్యంలో పుష్పగుచ్ఛం అందించి శాలువాతో కలెక్టర్‌ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మేడిపల్లి చైతన్య, ఉదయ్‌కుమార్, కుమారస్వామి, ప్రదీప్, పిట్టల రవి, రాంగోపాల్, మహేందర్, శ్రీవాణి, తేజస్విని, సరంసింగ్, రమాదేవి, సుప్రియ, స్నేహ, అనూష, స్రవంతి, రవీందర్, వీరస్వామి, యశ్వంత్, నాగార్జున, రాజేశ్ నరేశ్, తదితరులు పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాలి
టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు రాజునాయక్
వెంకటాపురం(ఎం): ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయుల, పెన్షనర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలని టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు అజ్మీర రాజునాయక్ ప్రభుత్వాన్ని కోరారు. గురువారం మండలంలోని బుర్గుపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో భోజన విరామం సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా రాజునాయక్ మాట్లాడుతూ.. పెండింగ్ బిల్లులు, డీఏలు, పీఆర్సీ, సీపీఎస్ వంటి కీలక అంశాలు సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా ఉన్నాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయులు రమేశ్‌బాబు, సురేఖ, శరత్ బాబు, దయాకర్, జవహర్ లాల్, జాను, రాజు తదితరులు పాల్గొన్నారు.


