యువ విలాపం! | - | Sakshi
Sakshi News home page

యువ విలాపం!

Apr 10 2026 10:27 AM | Updated on Apr 10 2026 10:27 AM

యువ విలాపం!

విడతల వారీగా కేటాయింపు..

రాజీవ్‌ యువ వికాసం దరఖాస్తుదారుల్లో నిరాశ

ములుగు రూరల్‌: నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్‌ యువ వికాసం పథకం ప్రవేశపెట్టి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. కానీ అమలు చేయడంలో మాత్రం జాప్యం చేస్తోంది. జూన్‌ 2న పథకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశ్యంతో హడావిడిగా నిరుద్యోగ యువత నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్‌, ఆఫ్‌ౖ లె న్‌లో స్వీకరించారు. నేటికి పది నెలలు గడిచినా పథకం అమలు తీరుపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో నిరుద్యోగ యువత నిరాశ చెందుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు, చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు యువకులు దరఖాస్తులు అందించారు. జిల్లా స్థాయిలో ఎంపీడీఓలు లబ్ధిదారులకు బ్యాంకుల ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూలు నిర్వహించారు. మంజూరు పత్రాలు ప్రకటించారు. రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రభుత్వం తాత్కలికంగా వాయిదా వేయడంతో స్వయం ఉపాధి ఊసేలేకుండాపోయింది.

జిల్లాలో 3,005 మంది దరఖాస్తులు

ములుగు జిల్లాలోని పది మండలాల్లో మొత్తం 3,005 మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి కోసం దరఖాస్తులు చేసుకున్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ 608 మంది, ఎస్టీ కార్పొరేషన్‌ 1,200, మైనార్టీ కార్పొరేషన్‌ 96, క్రిస్టియన్‌ మైనార్టీ–1, బీసీ కార్పొరేషన్‌ 817, ఈబీసీ వెల్ఫేర్‌ 67, వాషర్‌మ్యాన్‌ కార్పొరేషన్‌ సొసైటీ –11, నాయీబ్రాహ్మణ కో–ఆపరేటివ్‌ సొసైటీ–3, వడ్డెర కో–ఆపరేటివ్‌ సొసైటీ–1, సగార కో–ఆపరేటివ్‌ సొసైటీ–1, కృష్ణ బాలాజీ కో– ఆపరేటివ్‌ సొసైటీ–02, కమ్మరి శాలివాహన కో–ఆపరేటివ్‌ సొసైటీ–07, విశ్వబ్రాహ్మణ కో–ఆపరేటివ్‌ సొసైటీ–24, మేదర కో–ఆపరేటివ్‌ సొసైటీ–02, టాడీ సొసైటీ–15, గంగపుత్ర కో–ఆపరేటివ్‌ సొసైటి–40, పెరిక సొసైటీ–32, ముదిరాజ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ –21, మున్నురుకాపు కో–ఆపరేటివ్‌ సొసైటీ–28, గొల్ల కురుమ కో–ఆపరేటివ్‌ సొసైటీ–29 ద్వారా దరఖాస్తులు అందించారు.

ఊసు లేని స్వయం ఉపాధి

జిల్లాలో 3,005 దరఖాస్తులు

బ్యాంకుల ఎంపిక,

ఇంటర్వ్యూలు పూర్తి

పది నెలలు గడిచినా

అమలు కాని పథకం

రాజీవ్‌ యువ వికాసం కోసం దరఖాస్తులు చేసుకున్న వారిని కేటగిరీల వారీగా విభజించి విడతల వారీగా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. కేటగిరి–1లో 50 వేలు, కేటగిరి–2లో 1 లక్ష వరకు ఉన్న యూనిట్లను ఎంపిక చేసి మొదటి విడతలో అందించాలి. కేటగిరి–3 లో రెండు లక్షలు, కేటగిరి–4లో 4 లక్షలు, కేటగిరి–5 5లక్షలకంటే పైబడిన యూనిట్లను పరిగణిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement