వెంకటాపురం(ఎం): ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ వేతనాలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఎంఎస్పీ ములుగు జిల్లా కార్యదర్శి కాడపాక శ్యాం ప్రభుత్వాన్ని కోరారు. మండల కేంద్రంలోని ఈజీఎస్ నర్సరీ వద్ద పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా శ్యాం మాట్లాడుతూ.. మూడు నెలలుగా పని చేస్తున్నా.. కూలి డబ్బులివ్వకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, వెంటనే కూలీల వేతనాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జూకంటి పుష్ప, పోలోజు శ్రీవాణి, ల్యాగల సమ్మక్క, గుర్రం రాణి, వనం మమత, పల్లెబోయిన ప్రమీల, గండి సుజాత తదితరులు పాల్గొన్నారు.


