ప్రత్యేకం! | - | Sakshi
Sakshi News home page

ప్రత్యేకం!

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

ప్రత్

ప్రత్యేకం!

– IIలోu

న్యూస్‌రీల్‌

– IIలోu

సోమవారం శ్రీ 2 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026
ఓరుగల్లుకు లేదు
ఉమ్మడి వరంగల్‌ జిల్లా వాసులను నిరాశపరిచిన కేంద్ర బడ్జెట్‌

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆదివారం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్‌కు ప్రత్యేక కేటాయింపులు లేవు. వరంగల్‌కు కీలకమైన ఎయిర్‌పోర్ట్‌ నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. మెడికల్‌, ఐటీ హబ్‌లు ఏర్పాటు చేసే నగరాల జాబితాలో చోటు దక్కలేదు. పర్యాటక అభివృద్ధిలో ఈశాన్య రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇచ్చిన కేంద్రం.. ఈ బడ్జెట్‌లో ఓరుగల్లు పర్యాటకాన్ని పట్టించుకోలేదు. మేడారం జాతరకు జాతీయ హోదా ఊసేలేదు. ములుగు గిరిజన యూనివర్సిటీతో పాటు కాళోజీ, కాకతీయ యూనివర్సిటీల ప్రస్తావన లేదు. ఉమ్మడి వరంగల్‌లో కీలక ప్రాజెక్టులకు ఈ సారి మొండిచెయ్యే చూపారన్న చర్చ జరుగుతోంది. ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేదని కొందరు మేధావులు, ఆర్థికవేత్తలు అంటుండగా.. ఈసారి కూడా అన్యాయం జరిగిందని వివిధ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆ వర్గాల ఆశలు నెరవేరలే...

వ్యవసాయ అనుబంధ రంగాలు, ఉద్యోగులు, మధ్యతరగతి వారి ఆశలు నెరవేరలేదు. ఆ వర్గాలను ప్రభావితం చేసే అంశాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యం దక్కలేదు. ఉమ్మడి జిల్లాలో ఆదాయ పన్ను చెల్లింపుదారులు 5.28 లక్షల మందికి పైగా ఉన్నట్లు అంచనా. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అమలవుతున్న స్లాబులను కొనసాగించడంతోపాటు స్టాండర్డ్‌ డిడెక్షన్‌ను పెంచితే బాగుంటుందన్న వారి కోరిక తీరలేదు. డిసెంబర్‌ 31 నుంచి మార్చి 31 వరకు విస్తరించి, విద్య, వైద్య ఖర్చులపై టీడీఎస్‌ను 5 నుంచి 2 తగ్గించి చిన్నతరహా ఆదాయపన్ను చెల్లింపుదారులకు ఆరు నెలల ఊరట ఇచ్చారు. గృహ రుణాల విషయంలో వడ్డీ రాయితీ, చిన్న కమతాలు కలిగిన రైతులకు భరోసా కల్పించే అంశాలు బడ్జెట్‌లో లేవు. రింగురోడ్డు నిర్మాణం, స్మార్ట్‌సిటీ పథకం పొ డిగింపుపై స్పష్టత లేదు. బడ్జెట్‌లో రాయితీలు లేకపోవడంతో అనేకవర్గాలు పెదవి విరుస్తున్నాయి.

6 జిల్లాలకు 6 బాలికల హాస్టళ్లు..

బడ్జెట్‌పై భిన్నాభిప్రాయాలు..

పర్యాటకం, మెడికల్‌ హబ్‌లో దక్కని చోటు

‘ట్రైబల్‌’ సహా యూనివర్సిటీలకు కేటాయించని నిధులు

కేఎంటీపీకి ప్రయోజనం.. రైతులకు ఊరట

జిల్లాకో బాలికల హాస్టల్‌.. ఉపాధి, ఉద్యోగావకాశాలు

దేశంలోని అన్ని జిల్లాల్లో బాలికల హాస్టళ్లను అన్ని హంగులతో నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి వరంగల్‌లోని ఆరు జిల్లాలకు బాలికల హాస్టళ్లు రానున్నాయి. రైతులకు ఎరువులపై ఈసారి రాయితీ శాతాన్ని పెంచడం ఊరట కలిగించే అంశం కాగా, 9.17 లక్షల మందికి ప్రయోజనం కలగనుంది. కొత్త పథకం ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 75,834 ఎంఎస్‌ఎంఈ (సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు)లకు మేలు జరగనుంది. ఔషధాలకు బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ తొలగించి వైద్యం, ఆరోగ్యం పరంగా పేదలకు రాయితీలు ఇచ్చారు. క్యాన్సర్‌ రోగులకు సరఫరా చేసే మందుల ధరలు తగ్గనుండగా.. 23,190 మందికి నెలనెలా ఖర్చులు తగ్గనున్నాయి.

ప్రత్యేకం!1
1/9

ప్రత్యేకం!

ప్రత్యేకం!2
2/9

ప్రత్యేకం!

ప్రత్యేకం!3
3/9

ప్రత్యేకం!

ప్రత్యేకం!4
4/9

ప్రత్యేకం!

ప్రత్యేకం!5
5/9

ప్రత్యేకం!

ప్రత్యేకం!6
6/9

ప్రత్యేకం!

ప్రత్యేకం!7
7/9

ప్రత్యేకం!

ప్రత్యేకం!8
8/9

ప్రత్యేకం!

ప్రత్యేకం!9
9/9

ప్రత్యేకం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement