కేసీఆర్‌కు సిట్ నోటీసులు సరికాదు
ములుగు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడం సరికాదని బీఆర్‌ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద బీఆర్‌ఎస్ నాయకులు ఆదివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు సానికొమ్ము రమేశ్‌రెడ్డి మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్, మేడారం జాతర వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ద్వారా కేసీఆర్‌కు నోటీసులు ఇప్పించి ఇబ్బంది పెట్టాలని చూస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు మస్రగాని వినయ్‌కుమార్, కోగిల మహేశ్, ఆకుతోట చంద్రమౌళి, ముంజాల భిక్షపతి, గరిగె రఘు, అనుముల సురేశ్ తదితరులు పాల్గొన్నారు.


