గిరిజన దర్బార్ వినతులు ఇలా..
వాజేడు మండలం మండపాకలో విద్యుత్ సౌకర్యం కల్పించాలని గిరిజనులు ఏపీఓకు వినతి సమర్పించారు. వెంకటాపురం(కె) మండలంలోని మర్రిగూడెం కాలనీకి చెందిన గిరిజనుడు పోస్టుమార్టం చేసే అనుభవం, సర్టిఫికెట్ ఉందని, వెంకటాపురం(కె) ఆస్పత్రిలో ఎంఎన్‌ఓ పోస్టు ఇప్పించాలని కోరారు. ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లిలో ఖాళీగా ఉన్న కాంట్రాక్టు రెసిడెన్సీ టీచర్ ఉద్యోగం ఇప్పించాలని వేడుకున్నాడు. ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం కాల్వపల్లిలో చేతి పంపు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. మహబూబాబాద్ నుంచి రాముతండాలో ఇనుగుర్తికి చెందిన గిరిజనుడు పై చదువుల కోసం ల్యాప్‌టాప్ ఇప్పించాలని అధికారులను వేడుకున్నారు.వాజేడు మండల కేంద్రానికి చెందిన ఓ గిరిజనుడు వెంకటాపురం(కె) కాలేజీలో ఖాళీగా ఉన్న వాచ్‌మెన్ పోస్టు ఇప్పించాలని విన్నవించారు. మహబూబాబాద్ జిల్లాలోని రేకుల తండాకు చెందిన గిరిజనుడు ఎకనామికల్ సపోర్ట్ పథకం కింద రుణం ఇప్పించాలని కోరారు. ఈ వినతులను పరిశీలించి పీఓ దృష్టికి తీసుకెళ్తామని ఏపీఓ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీటీడీఓ జనార్ధన్, ఏఓ రాజ్‌కుమార్, ఎస్‌ఓ సురేశ్‌బాబు, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, డీటీ అనిల్, మేనేజర్ శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారి మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, ఆలెం కిశోర్, జగన్ తదితరులు పాల్గొన్నారు.


