కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా..
నా భార్య తిరుపతమ్మ గతేడాది డిసెంబర్ నెలలో అనారోగ్యంతో మరణించింది. లేబర్ కార్డు ఆధారంగా ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం కోసం దరఖాస్తు చేసుకున్నాను. నెలలు గడిచినా సాయం అందకపోవడంతో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాను. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వం నుంచి అందాల్సిన సాయం అందేలా చూడాలి.
– బేత నర్సింహరావు, మంగపేట
తాడ్వాయి మండలంలోని అంకంపల్లిని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి పైలెట్ ప్రాజెక్టుగా అధికారులు ఎంపిక చేశారు. అందులో నాకు ఇందిరమ్మ ఇల్లు రావడంతో నిర్మాణం చేపట్టాను. బెడ్ లెవెల్ పూర్తి అయింది. అయినా బిల్లు రావడం లేదు. అధికారులను సంప్రదిస్తే టెక్నికల్ ఇష్యూ అంటున్నారు. దయచేసి అధికారులు బిల్లు ఇప్పిస్తే మిగితా పనులు చేపడుతాను.
– మంకిడి ఝాన్సీ, అంకంపల్లి
నా భర్త నాగేశ్వర్‌రావు పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తూ 2012లో మృతి చెందాడు. నా భర్త కుటుంబ సభ్యులు లీగలేయర్ సర్టిఫికేట్‌లో నా పేరు లేకుండా తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించి నా భర్త తమ్ముడు చిడెం నరేశ్‌బాబు తప్పుడు సమాచారంతో లీగలేయర్ సర్టిఫికెట్ పొంది ఉద్యోగంలో చేరాడు. నేను హైకోర్టును ఆశ్రయించి లీగలేయర్ సర్టిఫికెట్‌ను రద్దు చేయించాను. నా భర్త తమ్ముడు నరేశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించి నాకు గాని, నా కూతురుకి గాని ఉద్యోగం ఇప్పించాలి.
– చిడెం రాధ, వెంకటాపురం(కె)
కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా..
కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా..


