నాసిరకం విత్తనాలతో మోసం
– వివరాలు 9లోu
● మద్యం దుకాణాలు పొందిన వారికి ‘సిండికేట్ల’ బంపర్ ఆఫర్
● రూ.30 లక్షల నుంచి రూ.కోటి వరకు డీల్
● మేడారం జాతర, స్థానిక ఎన్నికలే కారణం
● డిసెంబర్ 1 నుంచి దుకాణాలు నడిపేలా
‘సిండికేట్’ల వ్యూహం
● ఉమ్మడి వరంగల్‌లో
పడగవిప్పిన
మద్యం మాఫియా
మంగపేట: ఆరుగాలం కష్టపడి.. పంట చేతికి వచ్చే క్రమంలో నాసిరకం విత్తనాలను సాగు చేసి నష్టపోయామని తెలుసుకున్న రైతులు లబోదిబోమంటున్నారు. విత్తనాలను విక్రయించిన మన గ్రోమోర్ నిర్వాహకులను నిలదీస్తే పరిశీలిస్తామంటూ కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. తక్షణమే సంబంధిత అధికారులు పైరును పరిశీలించి నష్టపోయిన తమకు పరిహారం ఇప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. మండల పరిధిలోని రాజుపేటకు చెందిన రైతులు ముళ్లపూడి శ్రీనివాసరావు, మలిరెడ్డి నాగేందర్ రెడ్డి గ్రామంలోని మన గ్రోమోర్ సెంటర్‌లో స్వర్ణ ఎంటీయూ 7029 వరి విత్తనాలను జూన్ 12న కొనుగోలు చేశారు. రైతు నాగేందర్ రెడ్డి 7, శ్రీనివాసరావు 9 ఎకరాల్లో పంట సాగు చేశారు. ప్రస్తుతం పైరు కోత దశకు చేరినా 30 నుంచి 40 శాతం వరకు పైరు సుంకు, గింజ పోసుకునే దశలో ఉందని రైతులు వాపోతున్నారు. ఈ విషయంపై గ్రోమోర్ సెంటర్ నిర్వాహకులు ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పకుండా పదిరోజులుగా కాలయాపన చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కోత దశకు చేరిన పైరును కోయడంలో ఆలస్యం చేస్తే కంకి విరిగి పోయి పంట నేల పాలవుతుందని ఆందోళన చెందుతున్నారు. రాజుపేట పరిసర ప్రాంతాల్లో ఎక్కువ మంది రైతులు ఇదే రకం విత్తనాలను సాగు చేశారని వారి పరిస్థితి ఇదే విధంగా ఉందని చెబుతున్నారు. భూమి కౌలుకు తీసుకుని ఎకరాకు రూ. 45 వేల వరకు పెట్టుబడులు పెట్టి పంట సాగు చేస్తే కనీసం పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని, కౌలు ఎలా కట్టాలో తెలియడం లేదని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏఈఓ మహేశ్ రైతులతో కలిసి సోమవారం వరిపంటను పరిశీలించారు. రైతులు చెబుతున్న విధంగా కోతదశలో ఉన్న పైరుతో పాటు చాలా వరకు పైరు సుంకు, గింజ పోసుకునే దశలో ఉన్న విషయం వాస్తవమేనని వెల్లడించారు. విషయాన్ని పూర్తి స్థాయిలో అధ్యయనం చేసేందుకు సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. నాసిరకం వితనాలను విక్రయించడమే కాకుండా సమస్యపై స్పందించకుండా నిర్లక్ష్యం చేస్తున్న మన గ్రోమోర్ సెంటర్‌కు స్థానిక రైతులతో కలిసి తాళం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
రైతులు చెబుతున్న విషయం వాస్తవమే. ఈ సమస్య గురించి కంపెనీతో పాటు ధాన్యలక్ష్మి వెండర్‌కు సమాచారం ఇచ్చాం. వారు వచ్చి పరిశీలించే విషయంలో కొంత జాప్యం జరిగింది. నేడు మధ్యాహ్నం వరకు పంటను పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడి సమస్యను పరిష్కరించే విధంగా కృసి చేస్తాను. – రాజేందర్,
మన గ్రోమోర్ సెంటర్ మేనేజర్, రాజుపేట
న్యాయం చేయాలని రైతుల డిమాండ్
గ్రోమోర్ సెంటర్‌కు
తాళం వేసేందుకు యత్నం
నాసిరకం విత్తనాలతో మోసం


