రైతులు దళారులను నమ్మొద్దు | - | Sakshi
Sakshi News home page

రైతులు దళారులను నమ్మొద్దు

Nov 11 2025 7:03 AM | Updated on Nov 11 2025 7:03 AM

రైతుల

రైతులు దళారులను నమ్మొద్దు

రైతులు దళారులను నమ్మొద్దు మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం మూలపాలెం టు కాశి కార్తీకశోభ..

ఎస్‌ఎస్‌తాడ్వాయి: రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని జిల్లా వ్యవసాయశాఖ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేగ కల్యాణి అన్నారు. మండల పరిధిలోని కాటాపూర్‌లో శ్రీ సీతారామ, గంగారంలో చైతన్య గ్రామైక్య సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సోమవారం ప్రారంభించి మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలన్నారు. కేంద్రాల్లోని ఇబ్బందులను అధికారులు తన దృష్టికి తీసుకురావాలన్నారు. ధాన్యం ఏ గ్రేడ్‌ రకానికి రూ. 2,389లు, సాధారణ రకం ధాన్యానికి రూ.2,369 ధర లభిస్తుందన్నారు. సన్నరకం ధాన్యానికి ప్రభుత్వం రూ.500 బోనస్‌ చెల్లిస్తుందని తెలిపారు. ధాన్యం 17 తేమశాతం ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కిషన్‌, సీసీ సుజాత, పునేం నర్సింహులు, మాజీ సర్పంచ్‌ గౌరమ్మ, రైతులు పులి నర్సయ్య, దనూక నర్సింగారావు, చిరంజీవి పాల్గొన్నారు.

ములుగు రూరల్‌: మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా మత్స్యశాఖ అధికారి సాల్‌మన్‌రాజ్‌ అన్నారు. మండల పరిధిలోని ములుగు, మల్లంపల్లి మండలాల్లోని చెరువుల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో చేపపిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు సోమవారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వం పంపిణీ చేసిన చేపపిల్లలను చెరువుల్లో విడుదల చేఽశారు. ఈ సందర్భంగా సాల్‌మన్‌రాజ్‌ మాట్లాడుతూ చెరువుల్లో 35 నుంచి 40 ఎంఎం జిల్లాలో 25 చెరువులకు గాను 3,04,800 చేపపిల్లలను విడుదల చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకార్మిక సంఘం నామకులు పాల్గొన్నారు.

వాజేడు: శివ మాలాధారణ చేపట్టిన స్వాములు 1400కిలో మీటర్ల సైకిల్‌యాత్రను చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ అంబేడ్కర్‌ జిల్లా మూలపాలెం గ్రామం నుంచి శివదీక్ష చేపట్టిన నలుగురు స్వాములు చేపట్టిన యాత్ర వారం రోజులకు చేరుకుంది. ఈ సైకిల్‌యాత్ర చింతూరు, భద్రాచలం, చర్ల, వెంకటాపురం(కె) మీదుగా సోమవారం మండలకేంద్రానికి చేరుకుంది. వారం రోజుల నుంచి సైకిల్‌పై రోజుకు 70 కిలో మీటర్ల మేర ప్రయాణం చేస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ మహారాష్ట్ర మీదుగా ఉత్తర ప్రదేశ్‌లోని కాశీకి చేరుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారుగా 500 కిలో మీటర్ల ప్రయాణం చేశామని మరో 900 కిలో మీటర్ల ప్రయాణం చేసి కాశీకి చేరుకొని స్వామి వారిని దర్శించుకోనున్నట్లు వెల్లడించారు.

కాళేశ్వరం: కార్తీకమాసం సోమవారం కావడంతో కాళేశ్వరాలయంలో భక్తుల రద్దీ నెలకొంది. తెల్లవారు జామునుంచి త్రివేణి సంగమ గోదావరిలో భక్తులు పుణ్యస్నానాలు చేశారు. స్వామివారి ఆలయంలో అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి అమ్మవారి ఆలయంలో మహిళలు కుంకుమార్చన పూజలు చేశారు. శ్రీసరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు ఉసిరి చెట్టు వద్ద లక్షవత్తులు, దీపాలు వెలిగించారు. సాయంత్రం త్రివేణి సంగమం వద్ద గోదావరికి హారతి కార్యక్రమాన్ని అర్చకులు ఘనంగా నిర్వహించారు. కార్తీక సోమవారం సందర్భంగా అభిషేక మండపం వద్ద సహస్రదీపాలంకరణ చేశారు. వివిధ పూజలు, లడ్డు, ప్రసాదముల ద్వార రూ.4.37లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్‌ తెలిపారు.

రైతులు దళారులను నమ్మొద్దు1
1/3

రైతులు దళారులను నమ్మొద్దు

రైతులు దళారులను నమ్మొద్దు2
2/3

రైతులు దళారులను నమ్మొద్దు

రైతులు దళారులను నమ్మొద్దు3
3/3

రైతులు దళారులను నమ్మొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement