వినతులిచ్చాం.. పరిష్కరించండి
ప్రజావాణిలో 61, గిరిజన దర్బార్‌లో 7 దరఖాస్తులు
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, ఏటూరునాగారంలోని ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో ప్రజలు పలు సమస్యలపై వినతులు అందజేసి పరిష్కరించాలని అధికారులను వేడుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లు మహేందర్‌జీ, సంపత్‌రావులతో కలిసి కలెక్టర్ దివాకర వినతులు స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో ఏపీఓ వసంతరావు అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో 61, గిరిజన దర్బార్‌లో వచ్చిన 7 వినతులు పరిశీలించి పరిష్కరించాలని ధికారులకు సిఫారసు చేశారు.
పింఛన్లు 10
ఉపాధి కల్పన 03
ఇతర శాఖలు 30
భూ సమస్యలు 7
గృహ నిర్మాణశాఖ 11
కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లతో కలిసి అర్జీలను స్వీకరించిన కలెక్టర్
ఐటీడీఏలో ఏపీఓ వసంతరావు స్వీకరణ
పరిశీలించి పరిష్కరించాలని
అధికారులకు ఆదేశాలు


