డైరెక్టర్‌తో ప్రేమ పెళ్లి.. తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్! | Sakshi
Sakshi News home page

Yami Gautam: తల్లి కాబోతున్న నితిన్ మూవీ హీరోయిన్..!

Published Thu, Feb 8 2024 4:18 PM

Yami Gautam expecting first child with Aditya Dhar Goes Viral - Sakshi

నువ్విలా చిత్రం ద్వారా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన భామ యామీ గౌతమ్. ఆ  తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కల్యాణ్ లాంటి చిత్రాల్లో నటించింది. కన్నడ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ, పంజాబీ సినిమాల్లో కనిపించింది. గతేడాది బాలీవుడ్ చిత్రాలతో అలరించిన భామ ప్రస్తుతం ఆర్టికల్ 370 చిత్రంలో నటిస్తోంది. అయితే యూరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌ సినిమాలో నటించిన ముద్దుగుమ్మ ఆ మూవీ డైరెక్టర్‌ ఆదిత్య ధర్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే.

తాజాగా అభిమానులకు యామీ గౌతమ్‌ ఓ గుడ్‌ న్యూస్ చెప్పింది. త్వరలోనే తల్లి కాబోతున్నట్లు తన భర్తతో కలిసి ఈ విషయాన్ని వెల్లడించింది. ఇవాళ జరిగిన ఆర్టికల్ 370 సినిమా ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో ఆమె భర్త ఆదిత్య ధార్ అనౌన్స్ చేశారు. ఈ ఏడాది మే నెలలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుస్తోంది. యామీ ప్రస్తుతం నటించిన ఆర్టికల్ 370 మూవీ ప్రమోషన్లలో పాల్గొనేందుకు రెడీ అవుతోంది. ప్రియమణి కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను ఆమె ఆమె భర్త ఆదిత్య ధర్ నిర్మించారు. కాగా.. 2019లో 'యూరి: ది సర్జికల్ స్ట్రైక్' సెట్స్‌లో కలిసిన ఈ జంట రెండేళ్లపాటు డేటింగ్ తర్వాత జూన్ 4, 2021న పెళ్లి చేసుకున్నారు.

 
Advertisement
 
Advertisement