కథ విన్న వెంటనే నాని ఓకే చేశారు: శ్యామ్‌ సింగరాయ్‌ రచయిత | Writer Satyadev Janga About Shyam Singha Roy Movie | Sakshi
Sakshi News home page

కథ విన్న వెంటనే నాని ఓకే చేశారు: శ్యామ్‌ సింగరాయ్‌ రచయిత

Dec 21 2021 9:23 PM | Updated on Dec 22 2021 7:31 AM

Writer Satyadev Janga About Shyam Singha Roy Movie - Sakshi

Writer Satyadev Janga About Shyam Singha Roy Movie: నేచురల్‌ స్టార్‌ నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’.రాహుల్‌ సాంకృత్యన్‌ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు జంగా సత్యదేవ్ కథను అందించారు. వినూత్నమైన కథాంశంతో రానున్న ఈ సినిమా రచయితగా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందని సత్యదేవ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

ఆయన మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే నాని ఓకే చేశారు. ఈ చిత్రంలో ఆయన పలు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తారు. త్వరలో హర్రర్, థ్రిల్లర్, ఫ్యామిలీ డ్రామా కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తాను.నేను రెడీ చేసిన ఒక ఔట్ అండ్ ఔట్ లవ్ స్టోరీని ప్రముఖ బ్యానర్ ఓకే చేసింది.త్వరలో వాటి వివరాలు సత్యదేవ్ జంగా అధికారికంగా ప్రకటించనున్నారు అని పేర్కొన్నారు. ఈ కథను అద్భుతంగా చిత్రీకరించిన డైరెక్టర్‌ రాహుల్‌ సాంకృత్యాన్‌, హీరో నాని, నిర్మాత బోయనపల్లికి ధన్యవాదాలు తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement