ఆ యాంకర్లు భ్రష్టు పట్టిస్తున్నారు.. యాంకర్ వింధ్య షాకింగ్ కామెంట్స్ | Vindhya Vishaka Interview And Comments On Jabardasth Anchors | Sakshi
Sakshi News home page

Vindhya Vishaka: లేడీ యాంకర్స్‌పై విరుచుకుపడిన మరో యాంకర్

Apr 25 2024 3:46 PM | Updated on Apr 25 2024 3:46 PM

Vindhya Vishaka Interview And Comments On Jabardasth Anchors - Sakshi

యాంకర్ అనే పేరు చెప్పగానే తెలుగు వాళ్లకు సుమ గుర్తొస్తుంది. ఎందుకంటే దాదాపు 20 ఏళ్ల నుంచి యాంకరింగ్ ఇండస్ట్రీలో తనదైన మార్క్ సృష్టించింది. ప్రస్తుత జనరేషన్‌లో చాలామందిని ఈమెని స్ఫూర్తిగా తీసుకుని ఈ ఫీల్డ్‌లోకి వస్తున్నారని చెప్పొచ్చు. అలా వచ్చిన అమ్మాయే వింధ్య విశాఖ. షోలు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్‌తో పాటు ఐపీఎల్‌లోనూ తెలుగు కామెంటరీతో ఈమె చాలా గుర్తింపు తెచ్చుకుంది. అలాంటిది ఇప్పుడు తోటి యాంకర్స్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

(ఇదీ చదవండి: చిరు, పవన్ సినిమాల వల్ల అన్యాయం.. ప్రముఖ నటుడు ఆవేదన)

'సుమక్క అంటే నాకు చాలా ఇష్టం. ఆమెని కలిసినప్పుడల్లా.. మాకు కొన్ని షోలు విడిచిపెట్టొచ్చు కదా అని ఫన్నీగా సతాయిస్తుంటాం. సుమక్క విషయానికొస్తే ఆమె టైమింగ్ సూపర్. ఉదయభాను ఇన్నేళ్ల నుంచి యాంకరింగ్ చేస్తున్నారు. గ్లామర్, లుక్స్ మాత్రం ఫెర్ఫెక్ట్‌గా మెంటైన్ చేస్తున్నారు. ఝాన్సీ గారికి సమాజం పట్ల నాలెడ్జ్ చాలా ఉంది. ఆమెతో కాసేపు మాట్లాడితే చాలా విషయాలు నేర్చుకోవచ్చు'

'ఇంకొందరు యాంకర్స్ ఉన్నారు. తెలుగు సరిగ్గా మాట్లాడలేరు. ఓ రకంగా చెప్పాలంటే వాళ్లు యాంకరింగ్‌‌ని భ్రష్టు పట్టిస్తున్నారు. కొన్ని షోల్లో బూతులని, డబుల్ మీనింగ్ కామెడీని వాళ్లు జనాలకు అలవాటు చేస్తున్నారా అనిపిస్తుంది' అని యాంకర్ వింధ్య చెప్పుకొచ్చింది. ఈమె చెప్పిన దానిబట్టి చూస్తుంటే 'జబర్దస్త్' షో, అందులోని యాంకర్స్ గురించే సెటైరికల్ కామెంట్స్ చేసిందా అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: వీడియో: గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న యంగ్ హీరోయిన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement