సీరియస్‌గా ప్రయత్నించా.. ఎవరూ ఛాన్సివ్వలేదు: సేతుపతి | Vijay Sethupathi Opens Up About Rejecting Pushpa Movie | Sakshi
Sakshi News home page

పుష్ప రిజెక్ట్‌ చేశారా? సేతుపతి ఆన్సర్‌ ఏంటో తెలుసా?

Published Mon, Jun 17 2024 5:59 PM | Last Updated on Mon, Jun 17 2024 6:34 PM

Vijay Sethupathi Opens Up About Rejecting Pushpa Movie

మహారాజ సినిమా తెలుగులో రిలీజ్‌ చేస్తున్న విషయం చాలామందికి తెలియదు. కొన్ని ప్రమోషన్లు చేసినా అందరికీ అది రీచవలేదు. అసలు మహారాజ సినిమా ఏంటి? ఇదెప్పుడు తీశారు? అని చాలామంది అనుకున్నారు. అయితే రిలీజైన రోజే ఈ సినిమా పేరు మార్మోగిపోయింది. మౌత్‌టాక్‌తోనే మహారాజ గురించి అందరికీ తెలిసొచ్చింది. విజయ్‌ సేతుపతి నటన, నితిలన్‌ సామినాథన్‌ డైరెక్షన్‌, అజనీష్‌ లోకనాథ్‌ బీజీఎమ్‌ ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. ఏ రోజుకారోజు వసూళ్లు పెంచుకుంటూ సూపర్‌ హిట్‌ దిశగా ముందుకు సాగుతోంది.

రామ్‌చరణ్‌ సినిమాలో?
జూన్‌ 14న ఈ ద్విభాషా(తమిళ, తెలుగు) చిత్రం రిలీజవగా.. సోమవారం నాడు చిత్రయూనిట్‌ హైదరాబాద్‌లో థాంక్యూ మీట్‌ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సేతుపతి ఓపికగా సమాధానాలిచ్చాడు.  బుచ్చిబాబు-చరణ్‌(#RC16) మూవీలో ఏదైనా పాత్ర చేసే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు లేదని బదులిచ్చాడు. ఎటువంటి పాత్రలు పోషించడం ఇష్టమన్న క్వశ్చన్‌కు రొమాంటిక్‌ పాత్రలు చేయడం ఎక్కువ ఇష్టమన్నాడు.

సీరియస్‌గా ట్రై చేశా..
సైరా తర్వాత ఉప్పెన వరకు గ్యాప్‌ తీసుకున్నారు.. అలాగే పుష్ప సినిమా రిజెక్ట్‌ చేశారా? అన్న ప్రశ్నకు సేతుపతి స్పందిస్తూ.. నేను సీరియస్‌గా ప్రయత్నించాను సర్‌, కానీ నాకు ఎవరూ అవకాశాలివ్వలేదు. పుష్ప మూవీలో ఛాన్స్‌ నేను రిజెక్ట్‌ చేయలేదు. అయితే అన్నిసార్లు నిజాలే మాట్లాడకూడదు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం మంచిది అని పేర్కొన్నాడు.

ఎప్పుడో చెప్పిన సేతుపతి
కాగా పుష్ప 1 షూటింగ్‌కు ముందే ఆయన ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీనిపై 2020వ సంవత్సరంలోనే సేతుపతి క్లారిటీ ఇచ్చాడు. పుష్పలో భాగం కావాలని ఉన్నప్పటికీ డేట్స్‌ కుదరకపోవడం వల్లే ఆ ప్రాజెక్టు నుంచి వైదొలిగినట్లు పేర్కొన్నాడు. దర్శకుడు సుకుమార్‌ను కలిసి మరీ తన నిర్ణయాన్ని తెలిపినట్లు వెల్లడించాడు.

చదవండి: పవిత్రకు ఇంత పెద్ద కూతురు ఉందా?.. మొదటి భర్త ఎవరో తెలుసా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement