Vijay Antony : అలాంటి వారితో పనిచేయడం సంతోషంగా ఉంది: విజయ్ ఆంటోని

విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం కొలై. మీనాక్షీ చౌదరి నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్, లోటస్ పిక్చర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. బాలాజీ కె.కుమార్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్రబృందం తాజాగా స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు.
నిర్మాతల్లో ఒకరైన ధనుంజయన్ మాట్లాడుతూ ఈ చిత్రం రూపొందడానికి ప్రధాన కారణం నటుడు విజయ్ ఆంటోని అని పేర్కొన్నారు. దర్శకుడు బాలాజీ కె.కుమార్ ప్రతిభావంతుడన్నారు. ఆయనకు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి అనుభవం ఉందన్నారు. ఆయనతో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర క్లైమాక్స్‌ను చాలా ఉత్కంఠగా ఉంటుందన్నారు. ఇది తన తొలి తమిళ చిత్రం అని నటి మీనాక్షి చౌదరి పేర్కొన్నారు.
ఇందులో నటించడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర కథానాయకుడు విజయ్ ఆంటోని మాట్లాడుతూ ఈ చిత్రంలో భాగం కావడం ఘనంగా భావిస్తున్నానన్నారు. ఇది దర్శకుడు బాలాజీ కె. కుమార్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. కొలై ప్రపంచస్థాయి ఉత్తమ చిత్రంగా నిలుస్తుందని తాను ధృఢంగా చెప్పగలనన్నారు. చిత్ర నిర్మాతలు ఎంతో ప్రతిభావంతులని, వారు తమిళ సినిమాకు వరం లాంటి వారని చెప్పారు. అలాంటి వారితో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని విజయ్ ఆంటోని అన్నారు. దీనికి శివకుమార్ విజయన్ ఛాయాగ్రహణం, గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు