అరుణ్‌ విజయ్‌ చిత్రంలో గంగై అమరన్‌ 

Veteran Filmmaker And Composer Gangai Amaran Re Entry After 8 Years - Sakshi

చెన్నై: సీనియర్‌ దర్శకుడు, పాటల రచయిత, సంగీత దర్శకుడు, నటుడు గంగై అమరన్‌ చాలా గ్యాప్‌ తరువాత మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు. 55 చిత్రాలకు పని చేసిన ఆయన, 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు. గంగై అమరన్‌ కలం నుంచి జాలువారిన పలు పాటలు ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో మారుమోగుతునే ఉన్నాయి. సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు, దర్శకుడు వెంకట్‌ ప్రభు తండ్రి అయిన ఈయన 2013 నుంచి నటనకు దూరంగా ఉన్నారు.

కాగా తాజాగా అరుణ్‌ విజయ్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రంలో గంగై అమరన్‌ అతిథి పాత్రలో నటించడం విశేషం. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని డ్రమ్‌స్టిక్స్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై వెడికరన్‌ పట్టి ఎస్‌.శక్తివేల్‌ నిర్మిస్తున్నారు.  

చదవండి : దాసరి అరుణ్‌పై అట్రాసిటీ కేసు 
ఆ ఫొటో వల్లే సినిమా ఛాన్స్‌ వచ్చింది : వైశాలీ రాజ్‌

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top