
విక్రమ్, దేవకీ రమ్య, హర్షిత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘వెంకీ పింకీ జంప్’ సినిమా ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు తొలి సన్నివేశానికి క్లాప్ ఇవ్వగా, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. శ్రీమతి లక్ష్మీ సమర్పణలో వెంకట్ ఆర్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ప్రేమ పిలుస్తోంది’ ఫేమ్ అజయ్ నాతారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ –‘‘పూర్తిగా తెలంగాణ కళాకారులతో ఈ సినిమా షూటింగ్ మొత్తం సిద్ధిపేటలోనే జరగనుంది. టైటిల్ ఆసక్తికరంగా ఉంది.
ఈ చిత్రం నిర్మాత వెంకట్‌కు, దర్శకుడు అజయ్‌కు మంచి పేరు తీసుకురావాలి’’ అన్నారు. ‘‘మంత్రి హరీష్‌రావుగారు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిగారు ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిర్మాత వెంకట్. ‘‘లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. దాదాపు రెండు నెలల పాటు సింగిల్ షెడ్యూల్లో ఈ చిత్రాన్ని సిద్ధిపేట పరిసర ప్రాంతాల్లో పూర్తి చేస్తాం’’ అన్నారు దర్శకుడు అజయ్.