Adipurush Poster: ప్రభాస్ పోస్టర్‌పై యానిమేషన్ స‍్టూడియో అభ్యంతరం.. కాపీ కొట్టారంటూ..!

Vanar sena animation studio alleged Adipurush Poster is Copied - Sakshi

ప్రభాస్ తాజా మూవీ 'ఆదిపురుష్' టీజర్‌పై రోజురోజుకు విమర్శలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే టీజర్‌ బాగాలేదంటూ కొందరు వాదిస్తుండగా.. మరికొందరేమో యానిమోషన్ మూవీలా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇవే కాకుండా రాజకీయ నాయకులు ఆదిపురుష్ టీజర్‌పై విమర్శలు చేశారు. అయితే తాజాగా మరో సంస్థ టీజర్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ప్రభాస్ ఆదిపురుష్ పోస్టర్‌ను కాపీ కొట్టారని యానిమేషన్ స్టూడియో ఆరోపించింది. చిత్ర నిర్మాతలు టీ-సిరీస్ అసలు సృష్టికర్త ఎవరో చెప్పాలని డిమాండ్ చేసింది.

(చదవండి: ‘ఆదిపురుష్‌ సినిమాను బ్యాన్‌ చేయాల్సిందే’.. అయోధ్య ప్రధాన పూజారి ఆగ్రహం)

ఆదిపురుష్ సినిమాలోని ప్రభాస్‌ పోస్టర్‌ను పోలుస్తూ వానర్ సేన స్టూడియోస్ సంస్థ రూపొందించిన శివ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే దీనిపై మేము ఎలాంటి ఫిర్యాదు చేయడం లేదని వెల్లడించింది. వానర్ సేన స్టూడియోస్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోను పోస్ట్ చేస్తూ  'ఎంత అవమానకరం, టి-సిరీస్ ఆర్ట్‌వర్క్‌ను అభివృద్ధి చేసింది ఎవరో ప్రస్తావించాలంటూ' అని క్యాప్షన్ పెట్టింది. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్, కృతి సనన్, సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top