
సాక్షి, ముంబై: లాక్‌డౌన్ నుంచి సమస్యల్లో ఉన్నవారికి సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్. కరోనా కాలంలో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలను వారి స్వరాష్ట్రాలకు చేర్చిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఎక్కడ సమస్య, సాయం పేరు విన్న వెంటనే స్పందిస్తూ వారికి చేయూతనిస్తున్నారు. అంతేగాక ప్రజలు కూడా తమ సమస్యలను నేరుగా సోనూ సూద్‌కు సోషల్ మీడియా వేదిక తెలుపుతున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఓ వైద్య విద్యార్థిని సోనూ సూద్‌కు ట్వీట్ చేస్తూ.. ‘హాలో సోనూ సూద్ సార్... దాదాపు 100 మంది వైద్య విద్యార్థులం దక్షిణ అమెరికాలోని గయానాలో చిక్కుకున్నాం. మేమంతా తిరిగి మా ఇళ్లకు రావాలనుకుంటున్నాం. దయ చేసి మాకు సాయం చేయండి’ అంటూ ట్వీట్ చేసింది. (చదవండి: పాపం! సోనూ సూద్ ఇంత బిజీనా..)
ఆ వైద్య విద్యార్థిని ట్వీట్‌కు సోనూ సూద్ స్పందిస్తూ... వారికి తప్పకుండా సాయం చేస్తానని భరోసానిచ్చారు. ‘కొత్త దేశం.. కొత్త మిషన్.. తప్పకుండా సాయం అందిస్తా.. అప్పటివరకు మిమ్మల్ని సంప్రదిస్తూనే ఉంటాను’ అంటూ ఆమె ట్వీట్‌కు ఆయన సమాధానం ఇచ్చారు. అయితే ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లో చిక్కుకున్న భారతీయులను తిరిగి రప్పించేందుకు రెండుసార్లు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే కజకిస్థాన్‌లో చిక్కుకున్న తెలుగు వారికి సైతం మరొక ప్రత్యేక విమానం ఏర్పాటు చేశాడు. ఈ విమానం ఆగస్టు 14న కజకిస్థాన్‌కు బయల్దేరింది.
(చదవండి: సోనూసూద్ హామీ: రెండు రోజుల్లో వారంతా ఢిల్లీకి..)
New country.
— sonu sood (@SonuSood) August 17, 2020
New mission.
Let’s do it.
Connecting with you 👍 https://t.co/kwFrjkqpx1