మహేశ్ బాబు త్రీ మినిట్ ఛాలెంజ్.. మీరు చేయగలరా? | Tollywood Prince Mahesh Babu Stunning Workouts In Gym | Sakshi
Sakshi News home page

Mahesh Babu: మహేశ్ బాబు త్రీ మినిట్ ఛాలెంజ్.. మీరు సిద్ధమేనా?

Published Sat, Jul 1 2023 8:58 PM | Last Updated on Sun, Jul 2 2023 7:19 AM

Tollywood Prince Mahesh Babu Stunning Workouts In Gym - Sakshi

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజకుమారుడి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత మురారి, ఒక్కడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో స్టార్ హీరో హోదా దక్కించుకున్నాడు. ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే తాజాగా మహేశ్ బాబు షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

(ఇది చదవండి: ప్రియుడి బర్త్‌డే బాష్‌: మలైకా డ్రెస్‌ ఖరీదెంతో తెలుసా?)

ప్రస్తుతం గుంటూరు కారం చిత్రంలో నటిస్తోన్న మహేశ్ బాబు జిమ్‌లో కసరత్తులు చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన ఓ వీడియోను తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. జిమ్‌లో మూడు రకాల తన ఫేవరేట్ వర్కవుట్స్‌ ఇవేనంటూ క్యాప్షన్ ఇచ్చాడు. మై సాటర్‌ డే సిజిల్ సెట్ అంటూ ఒక నిమిషం ల్యాండ్‌మైన్ ప్రెస్, ఒక నిమిషం కెటిల్‌బెల్ స్వింగ్, ఒక నిమిషం స్కిల్‌మిల్ రన్!! మీరు ఎన్ని సెట్లు చేయగలరు ??? అంటూ ఛాలెంజ్ విసిరారు. ఇది చూసిన మహేశ్ సతీమణి నమ్రత శిరోద్కర్ ఫైర్ ఎమోజీలతో కామెంట్ చేసింది. ఇది చూసిన మహేశ్ బాబు ఫ్యాన్స్ మాత్రం మరో పోకిరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

(ఇది చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement