నిర్మాతగా కిరణ్ అబ్బవరం.. తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ రిలీజ్ | tollywood movie Thimmarajupalli TV Official Trailer out now | Sakshi
Sakshi News home page

Thimmarajupalli TV Official Trailer: తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ రిలీజ్

Apr 9 2026 7:07 PM | Updated on Apr 9 2026 7:32 PM

tollywood movie Thimmarajupalli TV Official Trailer out now

టాలీవుడ్ హీరో కిరణ్‌ అబ్బవరం నిర్మిస్తోన్న తాజా చిత్రం తిమ్మరాజుపల్లి టీవీ. విలేజ్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తోన్న ఈ పీరియాడికల్ మూవీలో  కెమెరా అసిస్టెంట్‌గా పనిచేసిన సాయితేజ్‌ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో వేదశ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. కేఏప్రోడక్షన్స్‌ పతాకంపై ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో వి మునిరాజు దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజైన ట్రైలర్ చూస్తుంటే గ్రామీణ నేపథ్యంలోనే సాగే కథగా తెరెకెక్కించినట్లు తెలుస్తోంది. టీవీ సౌకర్యం లేని ఓ ఊరి కథగా ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది. ట్రైలర్‌లో గ్రామంలోని అందరూ కలిసి ఓకే చోట టీవీ చూడటం లాంటి సీన్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఇప్పటికే రిలీజైన పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీలో ప్రదీప్‌ కొట్టె, తేజ విహాన్, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేశ్, సత్యనారాయణ వడ్డాది, మాధవి ప్రసాద్, టీవీ రామన్, చిట్టిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 17న థియేటర్లలో సందడి చేయనుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement