'మౌనిక ప్రెగ్నెన్సీపై అలాంటి వార్తలు'.. స్పందించిన మంచు మనోజ్ | Tollywood Hero Manchu Manoj Respond on Rumours On Wife Pregnency | Sakshi
Sakshi News home page

Manchu Manoj: అలాంటి వాటిని నమ్మకండి.. ఏదైనా ఉంటే చెప్తా: మంచు మనోజ్

Mar 12 2024 6:28 PM | Updated on Mar 12 2024 7:15 PM

Tollywood Hero Manchu Manoj Respond on Rumours On Wife Pregnency - Sakshi

టాలీవుడ్ హీరో మంచు మనోజ్‌ గతేడాది వివాహా బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఏపీలోని నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన భూమా మౌనికను పెళ్లాడారు. బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న మంచులక్ష్మి నివాసంలో జరిగిన వివాహా వేడుకకు మోహన్‌బాబు కూడా హాజరై ఈ జంటను అభినందించారు. గతేడాది డిసెంబర్‌లోనే అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ప్రకటించారు. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. 

అయితే ప్రెగ్నెన్సీ విషయంలో టాలీవుడ్ దంపతులపై వస్తున్న వార్తలపై మంచు మనోజ్ స్పందించారు. దయచేసి మా విషయంలో మీరు ఎలాంటి రూమర్స్‌ను నమ్మకండి. ఏదైనా ఉంటే మేమే అధికారికంగా ప్రకటిస్తామని తెలిపారు. తమకు కవల పిల్లలు పుట్టబోతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. ప్రస్తుతం తన భార్య మౌనిక ఏడో నెల గర్భంతో ఉందని.. ఈ ఏడాది మే నెలలో మా ఇంటికి రాబోతున్న బిడ్డ కోసం తాము ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని పేర్కొన్నారు. కొన్ని సంవత్సరాలుగా మీ ప్రేమ, అప్యాయత, మద్దతుకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశారు. ప్రస్తుతం మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

మోహన్‌బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన మనోజ్.. హీరోగా బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ గత కొన్నేళ్లుగా పూర్తిగా సినిమాలే చేయడం మానేశాడు. 2015లో ప్రణతీ రెడ్డి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న మనోజ్.. 2019లో ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. ఈ ఏడాది మార్చిలో భూమా మౌనికని పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు కూడా ఇది రెండే పెళ్లే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement