Teja: మమ్మల్ని పంచుకున్నారు.. ఆ తర్వాత ఆస్తులు కూడా: తేజ

Tollywood Director Teja Open About Struggles In Childhood Days - Sakshi

దగ్గుబాటి అభిరామ్‌ హీరోగా ఎంట్రీ ఇస్తున్న చిత్రం 'అహింస'. ఈ సినిమాలో గీతికా తివారి హీరోయిన్‌గా నటిస్తోంది. విభిన్న కథనాలతో సినిమాలను తెరకెక్కించే తేజ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా జూన్‌ 2న విడుదల థియేటర్లలో కానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్‌ కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు తేజ.

(ఇది చదవండి: ఉదయ్‌కిరణ్‌ డెత్‌ మిస్టరీ.. ఏమీ తెలియనట్లు నటిస్తున్నారు: తేజ)

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తన బాల్యంలో ఎదురైన ఇబ్బందులను పంచుకున్నారు.  తన చిన్నప్పుడు ఫుట్‌ పాత్‌ మీద పడుకున్న రోజుల గురించి తెలిపారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయానని.. ఆ తర్వాతే ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు చూశానని చెప్పుకొచ్చారు.  

తేజ మాట్లాడుతూ.. 'మేము చెన్నైలో ఉండేవాళ్లం. నాకు ఒక అక్క, ఒక చెల్లి. నా బాల్యంలో మాకు ఆస్తులు బాగానే ఉండేవి. నాకు ఊహ తెలిసే సరికి అమ్మ చనిపోయారు. ఆ బెంగతో నాన్న కొంతకాలానికే కన్నుమూశారు. ఆ పరిస్థితుల్లో మా భవిష్యత్తు తలకిందులైంది. మా బంధువులే మమ్మల్ని పంచుకున్నారు. అక్క ఒక చోట. నేనూ, చెల్లి మరో చోట ఉండాల్సి వచ్చింది. మమ్మల్ని చూసుకున్నందుకు వాళ్లు కూడా కొన్ని ఆస్తులు తీసుకున్నారు. అంతే కాకుండా ఓరోజు నన్ను ఆరు బయట పడుకోమన్నారు. నేను ఆ రోజు రాత్రే  పారిపోయా. ఫుట్‌పాత్‌పై పడుకున్నా. ఈ రోజు నేను ఈ స్థాయికి వచ్చానంటే కేవలం సినిమా వల్లే.' అంటూ తను పడిన బాధలను వివరించారు. 

(ఇది చదవండి: మీ కోసమే వచ్చా.. సల్లు భాయ్‌కి ప్రపోజ్‌ చేసిన అమ్మాయి!)

మహేశ్ బాబు హీరోగా నటించిన నిజం అనుకున్నంతగా ఆడకపోవడంతో సినిమాపై ఏకాగ్రత కోల్పోయానని అన్నారు. ఆ తర్వాత మా అబ్బాయికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో సుమారు నాలుగేళ్లపాటు సినిమాకు దూరంగా ఉన్నానని తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి మూవీతో తిరిగి హిట్‌ అందుకున్నా అని తేజ వెల్లడించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top