
అత్తారింటికి దారేది మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ ప్రణీత.. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటోంది. పెళ్లి తర్వాత నటనకు గుడ్ బై చెప్పేసిన కన్నడ బ్యూటీ ఫ్యామిలీతో కలిసి ఎక్కువగా కనిపిస్తోంది. తాజాగా ఇవాళ తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తన భర్త, కుమారుడితో కలిసి వెంకటేశ్వరస్వామికి మొక్కులు చెల్లించుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ప్రణీత తన ఇన్స్టాలో తిరుమల నుంచి ఫోటోలు షేర్ చేసింది. గోవిందా గోవిందా.. నా కుమారుడు కృష్ణ మొదటిసారి స్వామివారికి తలనీలాలు సమర్పించాడని క్యాప్షన్ రాసుకొచ్చింది. కర్ణాటకకు చెందిన ఈ బ్యూటీ తెలుగుతో పాటు శాండల్‌వుడ్ సినిమాల్లోనూ నటించింది. టాలీవుడ్‌లో అత్తారింటికి దారేది మూవీతో పాటు పాండవులు పాండవులు తుమ్మెద, బ్రహ్మోత్సవం, రభస లాంటి చిత్రాల్లో కనిపించింది.
Actress @pranitasubhash along with her family visited Tirumala to seek the divine blessings of Lord Venkateshwara!🙏✨#Pranita #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/9awUYQJtGk
— Telugu FilmNagar (@telugufilmnagar) July 16, 2025