Tammareddy Bharadwaja: ఆ సినిమా నా వల్లే పోయింది: తమ్మారెడ్డి భరద్వాజ ఆసక్తికర వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja Comments on His Entha Bagundo Movie - Sakshi

ప్రముఖ తెలుగు దర్శక-నిర్మాతల్లో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. ఆయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు. అందులో రామ్మా చిలకమ్మా ఒకటి. ఇందులో సుమంత్‌, లయ జంటగా నటించిన ఈ సినిమా పరాజయం పాలైంది. దీనిపై తాజాగా ఆయన స్పందించారు. ఇటీవల ఓ యూట్యూబ్‌లో చానల్‌తో ముచ్చటించిన ఆయన తన సినిమాల ప్లాప్‌ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో తన దర్శకత్వంలో వచ్చిన ఓ సినిమా పరాజయానికి తానే కారణమంటూ ఆసక్తిర వ్యాఖ్యలు చేశారు.

చదవండి: సూపర్ స్టార్‌ కృష్ణ గురించి అప్పట్లో మహాకవి శ్రీశ్రీ ఏమన్నారో తెలుసా?

రామ్మా చిలకమ్మాకు సుమంత్‌ బాగుంటాడని తీసుకుంటాడని తీసుకున్నా. నాగార్జునన కూడా పది ఫ్లాపుల తర్వాత సూపర్‌స్టార్‌ అయ్యాడు. అందువలనే ఈ సినిమాను సుమంత్‌తో చేయోచ్చని ట్రై చేసిన సినిమా అది’ అన్నారు.  ఆ తర్వాత ‘‘రామ్మా చిలకమ్మా’.. ‘స్వర్ణముఖి’.. ‘ఉర్మిళ’’ ఈ మూడు సినిమాలు కూడా నా మనసుకు దగ్గరగా ఉన్నవే. కానీ ఈ సినిమాలేవి బాగా ఆడలేదు. కాకపోతే ఇప్పటికీ మళ్లీ తీయదగిన కథ వాటిలో ఉంది. ఇక ‘ఎంతబాగుందో’ సినిమా విషయానికి వస్తే.. ఆ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించాడు.

చదవండి: ఈ నాలుగు కోరికలు తీరకుండానే కన్నుమూసిన సూపర్‌ స్టార్‌

మంచి పాయింట్ ఉన్న కథ అది. ఆ సినిమా ఫ్లాప్‌ కావడంలో ఎవరి తప్పు లేదు. డైరెక్టర్‌గా నేను కాకుండా వేరే వారు ఉన్నట్టయితే ఇది మంచి సినిమా అయ్యుండేది. ఆ సినిమాను నేను మిస్ హ్యాండిల్ చేశాను. నా వల్లే సినిమా పోయిందని అనుకునే సినిమాల్లో అది ఒకటిగా చెబుతాను. మిగతా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అడిగితే చెప్పలేను. కానీ, ఈ సినిమా మాత్రం నా మిస్ హ్యాండిలింగ్ వల్లనే పోయిందని ఒప్పుకుంటాను. ఇక ఇక్కడ సక్సెస్ వస్తే చేసిన తప్పులన్నీ దాంట్లో కొట్టుకుపోతాయి. ఫ్లాప్ వస్తే తప్పులను గురించి మాత్రమే మాట్లాడుకుంటారు’’ అంటూ చెప్పుకొచ్చారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top