Tamil Director Mani Nagaraj Passes Away Due To Cardiac Arrest - Sakshi
Sakshi News home page

Mani Nagaraj: ప్రముఖ దర్శకుడు మృతి.. ప్రముఖల సంతాపం

Aug 26 2022 9:59 AM | Updated on Aug 26 2022 10:58 AM

Tamil Director Mani Nagaraj Passes Away Due To Cardiac Arrest - Sakshi

డైరెక్టర్‌ మణి నాగరాజ్‌ గురువారం ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ వదద్ద కాక్క కాక్క చిత్రం నుంచి విన్నైతాండి వరుసవాయా చిత్రం వరకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. అనంతరం సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌, శ్రీదివ్య జంటగా నటించిన పెన్సిల్‌ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయ్యారు.

ప్రస్తుతం వాసువిన్‌ కర్ఫైణెగన్‌ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ దశలో ఉంది. స్థానిక పలసరవాక్కంలో నివాసం ఉంటున్న ఆయన గురువారం గుండపోటుతో హఠాన్మరణం చెందారు. నాగరాజ్‌ మృతి చిత్ర పరిశ్రమకు దిగ్భ్రాంతికి గురిచేసిందని పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement