స్నేహం.. లక్ష్యం | Tamannaah Bhatia Do You Wanna Partner to stream from September 12 | Sakshi
Sakshi News home page

స్నేహం.. లక్ష్యం

Aug 26 2025 12:08 AM | Updated on Aug 26 2025 12:08 AM

Tamannaah Bhatia Do You Wanna Partner to stream from September 12

ఇద్దరు స్నేహితుల సాహసోపేతమైన ప్రయాణం, కొత్త సంస్థ ఏర్పాటులో వారు ఎదురొన్న సవాళ్ల నేపథ్యంతో సాగే వెబ్‌సిరీస్‌ ‘డు యూ వనా పార్ట్‌నర్‌’. ఈ న్యూ ఏజ్‌ కామెడీ డ్రామా సిరీస్‌లో తమన్నా, డయానా పెంటీ ఫ్రెండ్స్‌గా నటించారు. నిషాంత్‌ నాయక్, గంగోపాధ్యయ ఈ సిరీస్‌ను డైరెక్ట్‌ చేశారు. కరణ్‌ జోహార్, అదార్‌ పూనావాలా, అపూర్వ మెహతా నిర్మించారు. ఈ సిరీస్‌ సెప్టెంబరు 12 నుంచి అమెజాన్  ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు వెల్లడించి, ఫస్ట్‌లుక్‌ను రిలీజ్‌ చేశారు మేకర్స్‌.

 ‘‘శిఖా (తమన్నా పాత్ర), అనహిత (డయానా పెంటీ) అనే ఇద్దరు మహిళలు కలిసి ఓ ఆల్కాహాల్‌ బ్రాండ్‌ స్టార్టప్‌ను మొదలు పెట్టాలనుకుంటారు. పురుషాధిక్యత అధికంగా ఉండే ఈ రంగంలో వారిద్దరూ  తమ లక్ష్యాలను ఎలా సాధించారు? ఈ క్రమంలో వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏంటి? వంటి అంశాల నేపథ్యంతో ఈ సిరీస్‌ సాగుతుంది’’ అని మేకర్స్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement