చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్‌లో ఉన్నాను: తాప్సీ | Sakshi
Sakshi News home page

చాలా ఏళ్ల నుంచి అతనితో డేటింగ్‌లో ఉన్నాను: తాప్సీ

Published Fri, Jan 19 2024 10:54 AM

Taapsee Pannu Dating With Mathias Boe Last 10 Years - Sakshi

టాలీవుడ్‌లో ‘ఝుమ్మంది నాదం’తో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్‌ తాప్సీ.. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. డెన్మార్క్‌ బ్యాడ్మింటన్‌ ఆటగాడు మాథిస్‌ బోతో తాప్సీ ప్రేమలో ఉన్నట్లు ఇప్పటికే అనేక వార్తలొచ్చాయి. అయితే తాప్సీ మాత్రం తన ప్రేమ గురించి ఎప్పుడూ పెదవి విప్పలేదు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై తొలిసారి ఆమె మాట్లాడింది.

దాదాపు పదేళ్ల నుంచి మాథిస్‌ బోతో ప్రేమలో ఉన్నానని ఇలా చెప్పింది. 'దక్షిణాది నుంచి బాలీవుడ్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే అతడితో పరిచయం ఏర్పడింది. ఇన్నేళ్ల కాలంలో మా బంధం మరింతగా బలపడుతూ వచ్చింది. ఆ సమయం నుంచి అతడి వెంటే నేను ఉన్నాను. అతనితో బ్రేకప్‌ చెప్పేసి మరో బంధంలో అడుగుపెట్టాలనే ఆలోచన ఏ రోజూ నాకు రాలేదు. అతడి వల్ల చాలా సంతోషంగా ఉన్నాను.  ప్రేమ, పెళ్లి విషయంలో నాకు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే మా ప్రేమ వ్యవహారం గురించి ఇప్పటివరకు నేను ఎక్కడా మాట్లాడలేదు.' అని తాప్సీ చెప్పింది.

చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి 13 ఏళ్లు అయ్యిందని తాప్సీ గుర్తు చేసుకుంది. ప్రేక్షకాదరణ వల్లే తాను ఈ స్థాయికి చేరుకోగలిగానని ఆమె పేర్కొంది. అభిమానుల తనపై చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు చెప్పింది. గతేడాదిలో షారుక్‌ ఖాన్‌తో 'డంకీ' చిత్రంలో తాప్సీ మెరిసింది. బాలీవుడ్‌లో ఈ సినిమా మంచి విజయాన్నే అందుకుంది. వహ లడ్‌కీ హై కహా, ఫిర్‌ అయీ హసీన్‌ దిల్‌రుబా, ఖేల్‌ ఖేల్‌ మే చిత్రాల్లో ఆమె నటిస్తుంది.

(ఇదీ చదవండి: జై శ్రీరామ్ అంటూ.. క్షమాపణ చెప్పిన నయనతార)

 
Advertisement
 
Advertisement