'తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు'.. వీరభద్రుడు ట్రైలర్ చూశారా? | Suriya Latest Movie VeeraBhadrudu Telugu Trailer out now | Sakshi
Sakshi News home page

Veera Bhadrudu Telugu Trailer: 'తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు'.. ట్రైలర్ అదుర్స్

May 11 2026 8:32 PM | Updated on May 11 2026 8:32 PM

Suriya Latest Movie VeeraBhadrudu Telugu Trailer out now

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా వస్తోన్న లేటేస్ట్ మూవీ కరుప్పు. ఈ మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. తెలుగులోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. వీరభద్రుడు పేరుతో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికే తమిళ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్.. తాజాగా తెలుగు ట్రైలర్ కూడా విడుదల చేశారు. కంగువ', 'రెట్రో'  డిజాస్టర్స్ తర్వాత వస్తోన్న మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ట్రైలర్ చూస్తుంటే లాయర్, కోర్టు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను చూపించే లక్ష్యంగా ఈ కథ ఉండనుందని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో త్రిష న్యాయవాదిగా కనిపించనుంది. 'దేవుడే దిగొచ్చినా కోర్ట్ ప్రోసీజర్‌ని మార్చలేడా? వచ్చాను కదరా.. పిచ్చకొట్టుడు కొడతా' అనే డైలాగ్ సూర్య ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. 'అయ్యో వచ్చింది తెలుగోళ్ల దేవుడైతే క్షమాపణ అడగొచ్చు.. కానీ వచ్చింది భద్రుడు.. వీరభద్రుడు.. ముక్కలు ముక్కలు చేసి కుక్కలకు పడేస్తాడు' ‍అనే డైలాగ్స్ చూస్తే ఫుల్ యాక్షన్‌ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దర్శకత్వం వహించిన ఆర్జే బాలాజీనే విలన్‌గా పాత్రలో కనిపించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement