ఆర్యన్‌ ఖాన్‌కు సోదరి బర్త్‌డే విష‍్షెస్‌.. చిన్ననాటి ఫొటో వైరల్‌

Suhana Khan Birthday Wishes To Her Brother Aryan Khan - Sakshi

బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, గౌరీ ఖాన్‌ దంపతుల పెద‍్ద కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ 24వ బర్త్‌డే సం‍దర్భంగా పలువురు ప్రముఖులు, కజిన్స్‌ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.  కజిన్‌ ఆలియా షేర్‌చేసిన చిన్ననాటి ఫోటోపై ఆర్యన్‌ చెల్లెలు సుహానా ఖాన్‌ స్పందించింది. అన్నయ్యకు ప్రేమగా లవ్‌ సింబల్‌తో బర్త్‌డే విషెస్‌ తెలిపింది. 

ఆ చిన్ననాటి ఫొటోలో చిట్టి సుహానా, అలియా మాట్లాడుతుండగా ఆర్యన్‌, అతని కజిన్ అర్జున్‌ ఫొటోకు ఫోజులివ్వడాన‍్ని మనం చూడొచ్చు. ఆర్యన్‌ కజిన్స్‌ అలియా చీబా, అర్జున్‌ చిబా సోషల్‌ మీడియా వేదికగా ఫొటోలు షేర్‌ చేస్తూ బర్త్‌ డే బాయ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్యన్‌ ఖాన్‌ 24వ పుట్టిన రోజు సందర‍్భంగా అతని సోదరి సుహానా ఖాన్‌ షేర్‌ చేసిన చిన్ననాటి ఫొటో ఇ‍ప్పటికే వైరల్‌ అవుతోంది. 

షారుఖ్ ఖాన్ మరియు గౌరీ ఖాన్‌ల పెద్ద కొడుకు ఆర్యన్‌ ఇటీవలె డ్రగ్స్‌ కేసులో అరెస్టయి ఇటీవలె బెయిల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆర్యన్‌ పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top