బాలయ్య 'వీరసింహారెడ్డి' నుంచి మరో అప్‌డేట్‌ | Sakshi
Sakshi News home page

Veera Simha Reddy : బాలయ్య 'వీరసింహారెడ్డి' నుంచి మరో అప్‌డేట్‌

Published Mon, Dec 12 2022 10:07 AM

Suguna Sundari Song Promo From Veera Simha Reddy Is Out Now - Sakshi

ప్రేయసితో ఆడి పాడారు వీరసింహారెడ్డి. బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌ కుమార్, దునియా విజయ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ‘సుగుణ సుందరి..’ అనే పాటని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్‌ ప్రకటించి, ఈ పాటలోని ఓ స్టిల్‌ను రిలీజ్‌ చేసింది.

‘‘ఈ చిత్రంలోని చివరి పాట చిత్రీకరణతో షూటింగ్‌ పూర్తవుతుంది. మరోవైపు ΄పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్న ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: తమన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చందు రావిపాటి.

Advertisement
 
Advertisement
 
Advertisement