'ఇది అన్ని కుక్కల్లా లేదు.. ఏదో తేడాగా ఉంది' | Sakshi
Sakshi News home page

Pindam: 'ఇది అన్ని కుక్కల్లా లేదు.. వేరే జంతువులా ఉంది'.. ఆసక్తిగా టీజర్!

Published Mon, Oct 30 2023 3:55 PM

Srikanth Sriram and Kushee Ravi Starrer Movie Pindam Teaser Release - Sakshi

శ్రీకాంత్‌ శ్రీరామ్‌, ఖుషీ రవి జంటగా నటిస్తోన్న తాజా చిత్రం పిండం. ఈ సినిమాతో సాయికిరణ్‌ దైదా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రంలో అవసరాల శ్రీనివాస్, ఈశ్వరీ రావు, రవివర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు. టైటిల్‌, ఫస్ట్‌లుక్‌తోనే ఆసక్తి పెంచేశారు మేకర్స్. తాజాగా ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేశారు. 

టీజర్ ‍రిలీజ్ చేస్తూ..'ఇప్పటి వరకూ చూడని భయంకరమైన చిత్రం’ అనే ట్యాగ్‌లైన్‌తో విడుదల చేశారు. టీజర్‌ చూస్తే ఈ చిత్రం ఓ ఆత్మ చూట్టు తిరిగే కథాంశంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. 1930, 1990.. వర్తమానం.. ఇలా మూడు కాలాల్లో జరిగే కథనే ఈ మూవీలో చూపించనున్నారు. 

టీజర్ రిలీజ్ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ..'చిన్నప్పుడు విన్న ఓ కథను హారర్‌ జోనర్‌లో తెరకెక్కించాలని అనిపించింది. ఈ మూవీ స్క్రీన్‌ప్లే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. టైటిల్‌ పేరు వినగానే అందరూ ఈ  పేరు ఎందుకు పెట్టావని అన్నారు. మీ మొదటి సినిమానే ఇలా ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించారు. అది నెగెటివ్‌ పదమని అంతా అనుకుంటారు. కానీ, పిండం అంటే ఆరంభం.. అంతం రెండూ ఉంటాయి. అందుకే ఆ పేరు పెట్టా. సినిమా చూశాక టైటిల్ సరైందే అని మీకందరికీ అనిపిస్తుంది.' అన్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement