
సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ చిత్రాలతో వరుస విజయాలు అందుకున్న శ్రీవిష్ణు (Sree Vishnu).. ఈ ఏడాది సింగిల్‌తో మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 9న ప్రేక్షకుల ముందుకు రాగా.. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్సే రాబట్టింది. కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ఈ మూవీలో కేతిక శర్మ, ఇవానా హీరోయిన్లుగా నటించారు.
అల్లు అరవింద్ సమర్పణలో విద్య కొప్పినీడి, రియాజ్ చౌదరి, భాను ప్రతాప్ సంయుక్తంగా నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించాడు. తాజాగా ఈ మూవీ సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసింది. నేటి (జూన్ 6) నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోంది. అయితే ఇక్కడ మరో సర్‌ప్రైజ్ ఉంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో సింగిల్ అందుబాటులోకి రావడం విశేషం.
సింగిల్ సినిమా కథేంటంటే?
విజయ్ (శ్రీ విష్ణు) ఓ బ్యాంకులో పని చేస్తుంటాడు. 30 ఏళ్లు దాటినా సింగిల్‌గానే ఉంటాడు. ఓసారి మెట్రో రైలులో పూర్వ (కేతిక శర్మ)ను చూసి ప్రేమలో పడతాడు. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిశోర్) సాయంతో ఆమెను ఇంప్రెస్ చేసేందుకు రకరకాల ప్లాన్స్ వేస్తాడు. అదే సమయంలో విజయ్ జీవితంలో హరిణి (ఇవానా) వస్తుంది. పూర్వను పడేసేందుకు విజయ్ ఏమేం చేస్తాడో హరిణి కూడా అవన్నీ చేస్తుంది. అతడు ఛీ కొట్టినా అతడి వెనకాలే తిరుగుతుంది. అసలు విజయ్ ప్రేమను పూర్వ అంగీకరించిందా? లేదంటే హరిణి ప్రేమకు పడిపోతాడా? అదీకాక సింగిల్‌గానే మిగిలిపోయాడా? అన్నది తెలియాలంటే ఓటీటీలో సింగిల్ (Single Movie) చూడాల్సిందే!