సోనూ సూద్‌ కొత్త సినిమా.. ‘కిసాన్‌’ | Sonu Sood Launches New Film Kisaan Amid Farmers Protes | Sakshi
Sakshi News home page

రైతుల నిరసనలు.. ‘కిసాన్‌’తో సోనూ కొత్త సినిమా

Jan 4 2021 8:23 PM | Updated on Jan 4 2021 9:06 PM

Sonu Sood Launches New Film Kisaan Amid Farmers Protes - Sakshi

ముంబై : బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌ సోమవారం తన కొత్త సినిమా ప్రాజెక్టును ప్రకటించాడు. సోనూ సూద్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కిసాన్‌’ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఈ నివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. డ్రిమ్‌ గర్ల్‌ చిత్రాన్ని డైరెక్ట్‌ చేసిన రాజ్‌ శాం‌డిల్యా నిర్మాతగా వ్యవహరించనున్నారు. మిగతా చిత్ర యూనిట్‌ను ఇంకా ఫైనల్‌ చేయలేదు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ట్విటర్‌లో వెల్లడించారు. ఓ వైపు ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోనూ కిసాన్‌ సినిమా ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. చదవండి: ఆ సేవలు అభినందనీయం: సోనూ సూద్‌

 సోనూసూద్‌ కొత్త సినిమాకు బాలీవుడ్‌ బిగ్‌బీ అమితాబ్‌ బచ్చన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. అనంతరం సోనూ సూద్‌ స్వందిస్తూ అమితాబ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా లాక్‌డౌన్‌లో వలస కార్మికులకు సాయం చేసిన సోనూసూద్‌ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. సాయం అని కోరిన ప్రతి ఒక్కరికి హెల్ప్‌ చేస్తూ రియల్‌ హీరో అనిపించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికీ ఎక్కడ కష్టం ఉంటే అక్కడ నేనున్నానంటూ సోనూ సూద్‌ తన సేవలను కొనసాగిస్తున్నారు. అలాగే ఇటీవల సోనూసూద్‌ లాక్‌డౌన్‌లో ఎదురైన సవాళ్లను, అనుభవాలను వివరిస్తూ ఓ పుస్తకాన్ని రాశారు. ‘నేం ఆప‌ద్భాంద‌వుడిని కాను’(IAmNoMessiah) అనే అనే పేరుతో దీనిని విడుదల చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement