Shiva Vedha: ఓటీటీలోకి వచ్చేసిన 'శివ వేద'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Siva Rajkumar Latest Movie Vedha Streaming on ZEE5 - Sakshi

క‌న్న‌డ సూప‌ర్‌స్టార్ శివ రాజ్‌కుమార్ కీలక పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘శివ వేద’. భ‌యం అంటే తెలియ‌ని వ్య‌క్తి క‌థాంశ‌మే ఈ సినిమా. ఈ చిత్రాన్ని ఆయన భార్య గీతా శివ రాజ్‌కుమార్ నేతృత్వంలోని గీతా పిక్చర్స్ అనే బ్యాన‌ర్‌పై రూపొందించారు. హ‌ర్ష ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు . అర్జున్ జ‌న్యా సంగీతం అందించగా.. ఈ చిత్రానికి స్వామి జె.గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్స్ కంటే జీ 5లో వేద సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగు, క‌న్న‌డ‌, హిందీ, మల‌యాళ‌, త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లో వేద సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. 

అసలు కథేటంటే.. 
ఈ సినిమా కథంతా 1985, 1965 ప్రాంతాల కాలంలో జరుగుతుంది. 1985లో  వేద(శివరాజ్‌ కుమార్‌) కూతురు కనక(అదితి సాగర్‌) జైలు నుంచి విడుదలవుతుంది.  ఆ తర్వాత ఇద్దరు కలిసి చంద్రగిరి వెళ్తారు. అక్కడ పోలీసు అధికార రుద్ర(భరత్‌ సాగర్‌)ని కొట్టి చంపుతారు. ఆ తర్వాత మరో ఊరు వెళ్తారు.. అక్కడ ఒకరిని చంపుతారు. ఇలా ఊరు ఊరు తిరుగుతూ నలుగురిని చంపేస్తారు. రౌడీగా చలమణీ అవుతున్న గిరయ్యను చంపాలన్నదే వాళ్ల లక్ష్యం. అసలు తండ్రి కూతురు కలిసి ఈ మారణ హోమం ఎందుకు కొనసాగిస్తున్నారు? వేద గతం ఏంటి? అతని భార్య పుష్ప(గానవి లక్ష్మణ్‌) ఎలా చనిపోయింది? వరుస హత్యలు చేస్తున్నప్పటికీ మహిళా పోలీసు అధికారిణి రమా( వీణా పొన్నప్ప) ఎందుకు అడ్డుకోలేదు? కనకకు జరిగిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే శివ వేద చూడాల్సిందే.  థియేటర్లలో చూడలేన  వారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top