Is Sir Movie Actress Samyuktha Menon Hikes Her Remuneration, Deets Inside - Sakshi
Sakshi News home page

Samyuktha Menon Remuneration: హ్యాట్రిక్‌ హిట్‌.. భారీగా రెమ్యునరేషన్‌ పెంచేసిన సంయుక్త మీనన్‌!

Feb 27 2023 3:34 PM | Updated on Feb 27 2023 4:34 PM

Is Sir Actress Samyuktha Menon Hikes Her Remuneration - Sakshi

సంయుక్తి మీనన్‌... ప్రస్తుతం టాలీవుడ్‌ బాగా వినిపిస్తున్న పేరు. భీమ్లా నాయక్‌ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది ఈ మలయాళ బ్యూటీ. ఆ తర్వాత బింబిసార చిత్రంలో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రీసెంట్‌గా సార్‌ మూవీతో హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. ఈ మూడు చిత్రాలు మంచి విజయం సాధించడంతో తెలుగులో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన భామగా మంచి క్రేజ్‌ను సొంతంగా చేసుకుంది. దాంతో తెలుగు దర్శక-నిర్మాత దృష్టి ఇప్పుడు ఈ అమ్మడుపై పడింది.

చదవండి: జూ. ఎన్టీఆర్‌, మంచు లక్ష్మిని పోల్చకండి: నటి కస్తూరి షాకింగ్‌ కామెంట్స్‌

అంతేకాదు స్టార్‌ హీరోలు సైతం తమ చిత్రాలకు ఆమె పేరునే సిఫారసు చేస్తున్నారని టాక్‌. దీంతో ఆమెకు టాలీవుడ్‌లో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి.  ఈ క్రమంలో సంయుక్త రెమ్యునరేషన్‌ పెంచే ఆలోచనలో ఉందట. ‘భీమ్లానాయక్‌’లో ఆమె సెకండ్‌ హీరోయిన్‌గా చేసినప్పటికి నటన పరంగా ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. ఇక బింబిసారలో హీరోయిన్‌గా చేసినప్పటికీ ఆమె పాత్ర నిడివి పెద్దగా కనిపించలేదు. అయినప్పటికీ ఆమెకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది.

చదవండి: టాలీవుడ్‌ సినీ ప్రముఖులతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ భేటీ, చిరు ట్వీట్‌

దాంతో ధనుష్‌ హీరోగా తెలుగు దర్శకుడు వెంకి అట్లూరి తెరకెక్కించిన ద్విభాషా చిత్రం సార్‌ మూవీలో హీరోయిన్‌గా ఆఫర్‌ అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులే కాదు దర్శక-నిర్మాతలు కూడా ఫిదా అయ్యారు. కాగా అటూ తమిళం, ఇటూ తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటున్న సంయుక్త రెమ్యునరేషన్‌ భారీగా డిమాండ్‌ చేస్తోందని సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం సంయుక్త మీనన్‌ తమిళంలో బుమారంగ్‌ అనే చిత్రంలో నటిస్తోంది. మరోవైపు తెలుగులో సితార బ్యానర్లో ఓ సినిమాకు సంతకం చేసినట్లు సమాచారం. ఇందులో ఓ స్టార్‌ హీరోతో ఆ‍మె జతకట్టబోతుందట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement