శాంతనుకు శ్రుతి బ్రేకప్‌ చెప్పిందా? క్లారిటీ ఇచ్చిన హీరోయిన్‌ | Shruti Haasan Shares Adorable Pic With Boyfriend Santanu Hazarika | Sakshi
Sakshi News home page

Shruti Haasan: ప్రియుడితో బ్రేకప్‌ వార్తలపై స్పందించిన శ్రుతి హాసన్‌! ఫొటోతో క్లారిటీ..

Published Wed, Dec 21 2022 3:25 PM | Last Updated on Wed, Dec 21 2022 3:30 PM

Shruti Haasan Shares Adorable Pic With Boyfriend Santanu Hazarika - Sakshi

హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమాలతోనే కాదు వ్యక్తిగత విషయాల ద్వారా కూడా శ్రుతి తరచూ వార్తల్లో నిలుస్తోంది. తన ఫొటోలను, వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంటు ఉంటుంది. ఇక పర్సనల్‌ లైఫ్‌, రిలేషన్‌ షిప్‌ విషయానికి వస్తే శ్రుతి కొంతకాలంగా శాంతను హజారిక అనే చిత్రకళాకారుడితో ప్రేమలో మునిగితేలుతున్న సంగతి తెలిసిందే. అయితే రీసెంట్‌గా శ్రుతి షేర్‌ చేసిన పోస్ట్‌ ఆమె బ్రేకప్‌ రూమర్లకు తెరలేపాయి.

‘నాతో నేను ఉంటేనే సంతోషం.. నా విలువైన సమయాన్ని, ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను’ అంటూ పోస్ట్‌ పెట్టింది. దీంతో శ్రుతి మరోసారి ప్రేమలో విఫలం అయ్యిందని, శాంతనుతో తెగదెంపుల చేసుకుంది? అంటూ ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో తన బ్రేకప్‌ రూమర్లకు తాజాగా శ్రుతి క్లారిటీ ఇచ్చింది. తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో శాంతనుతో దిగిన ఫొటోను షేర్‌ చేసింది. దీనికి ‘ఎప్పుడు నేను కోరుకునేది ఇదే’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఈ ఒక్క ఫొటోతో శ్రుతి వీరి బ్రేకప్‌ వార్తలకు చెక్‌ పెట్టింది.

చదవండి: చాలా గ్యాప్‌ తర్వాత మూవీ ప్రమోషన్లో నయన్‌, హాలీవుడ్‌ నటిలా లేడీ సూపర్‌ స్టార్‌

అయినప్పటికీ ఇద్దరి మధ్య ఏమైన మనస్పర్థలు వచ్చి ఉంటాయని, అవి సద్దుమనగడంతో కలిసిపోయారంటూ ఆమె ఫాలోవర్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా శ్రుతి శాంతనుకు ముందు లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అతడి కొంతకాలం డేటింగ్‌ అనంతరం సడన్‌గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. అయితే తన బ్రేకప్‌ కారణం చెప్పలేదు. ఆ తర్వాత కొంతకాలనికి శాంతనుతో ప్రేమలో ఉన్నట్లు ప్రకటించింది. 

చదవండి: పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్‌ ప్రదీప్‌? ఆమెతోనే ఏడడుగులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement