పుట్టినరోజుకు 2 రోజుల ముందు చనిపోయిన పాపులర్‌ నటి | Seinfeld Actress Estelle Harris Passed Away At 93 | Sakshi
Sakshi News home page

Estelle Harris: పుట్టినరోజుకు ఇంకా రెండు రోజులు.. పాపులర్‌ నటి కన్నుమూత

Apr 3 2022 11:19 AM | Updated on Apr 3 2022 11:23 AM

Seinfeld Actress Estelle Harris Passed Away At 93 - Sakshi

'ఈ సాయంత్రం 6:25 గంటలకు ఎస్టేల్‌ హారిస్‌ మరణించిందని ప్రకటించడానికి చాలా బాధగా ఉంది. ఆమె దయ, అభిరుచి, సున్నితత్వం, హాస్యం, ఎంపథీ, ప్రేమ ఎవరూ ఇవ్వలేనివి. ఆమెకు తెలిసినవాళ్లకోసం పరితపించే వ్యక్తి.' అని తెలిపాడు గ్లెన్‌ హారిస్. ఏప్రిల్‌ 4, 1928న న్యూయార్క్‌లో జన్మించిన ఎస్టేల్‌ హారీస్‌ తన పుట్టినరోజుకు రెండు రోజుల ముందు చనిపోయారు. 

Seinfeld Actress Estelle Harris Passed Away At 93: హాలీవుడ్‌ పాపులర్‌ నటి ఎస్టేల్‌ హారిస్‌ శనివారం (ఏప్రిల్‌ 2) కాలిఫోర్నియాలో కన్నుమూశారు. 93 ఏళ్ల ఎస్టెల్‌ సహజంగా (వృద్ధాప్యం కారణంగా) మరణించారు. ఆమె మరణించినట్లుగా ఎస్టేల్‌ కుటుంబసభ్యులు ధ్రువీకరించారు. ఎస్టేల్‌ హారిస్‌ కుమారుడు గ్లెన్‌ హారిస్ ఆమెకు కన్నీటి నివాళి అర్పించాడు. 'ఈ సాయంత్రం 6:25 గంటలకు ఎస్టేల్‌ హారిస్‌ మరణించిందని ప్రకటించడానికి చాలా బాధగా ఉంది. ఆమె దయ, అభిరుచి, సున్నితత్వం, హాస్యం, ఎంపథీ, ప్రేమ ఎవరూ ఇవ్వలేనివి. ఆమెకు తెలిసినవాళ్లకోసం పరితపించే వ్యక్తి.' అని తెలిపాడు గ్లెన్‌ హారిస్. ఏప్రిల్‌ 4, 1928న న్యూయార్క్‌లో జన్మించిన ఎస్టేల్‌ హారీస్‌ తన పుట్టినరోజుకు రెండు రోజుల ముందు చనిపోయారు. 

ఎస్టెల్‌.. 'జెర్రి సీన్‌ఫెల్డ్‌' షోలో 'ఎస్టేల్‌ కోస్టాంజా' పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇందులో జాసన్‌ అలెగ్జాండర్‌గా పోషించిన జార్జ్‌ కోస్టాంజా తల్లి పాత్ర ఎస్టేల్‌ కోస్టాంజాగా ప్రేక్షకుల మన్ననలు పొందారు. 'టాయ్ స్టోరీ' మూవీ ఫ్రాంచైజీలో మిసెస్‌ పొటాటో హెడ్‌గా ఉన్న మరో ముఖ్య పాత్రలో కూడా ఎస్టేల్‌ హారీస్‌ నటించారు. ది సూట్‌ లైఫ్‌ ఆఫ్‌ జాక్ అండ్‌ కోడి, టార్జాన్‌ 2 వంటి చిత్రాల్లో అలరించారు. సీన్‌ఫెల్డ్‌ షో అభిమానులు ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తూ సంతాపం తెలియజేశారు. కాగా సీన్‌ఫెల్డ్‌ షోలో ఎస్టేల్‌ హారీస్‌ భర్త ఫ్రాంక్‌ కోస్టాంజాగా నటించిన జెర్రీ స్టిల్లర్‌ 2020 మేలో మరణించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement