నాకు నన్నే కొత్తగా చూపించారు: సత్యదేవ్‌ | Satyadev At Skylab Trailer Launch Event | Sakshi
Sakshi News home page

నాకు నన్నే కొత్తగా చూపించారు: సత్యదేవ్‌

Nov 7 2021 7:42 AM | Updated on Nov 7 2021 8:06 AM

Satyadev At Skylab Trailer Launch Event - Sakshi

Satyadev At Skylab Trailer Launch Event: ‘‘స్కైలాబ్‌’ చిత్రం బాగా వచ్చింది. ఈ ట్రైలర్‌ను చూస్తుంటే నాకు నన్నే కొత్తగా, నా నటనలోని మరో కోణాన్ని చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు విశ్వక్‌’’ అని సత్యదేవ్‌ అన్నారు. నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో విశ్వక్‌ ఖండేరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘స్కైలాబ్‌’. రవికిరణ్‌ సమర్పణలో పృథ్వీ పిన్నమరాజు నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 4న విడుదల కానుంది. హీరోయిన్‌ నిత్యామీనన్‌ ఈ సినిమాకు సహ నిర్మాత. ఈ సినిమా ట్రైలర్‌ను శనివారం విడుదల చేశారు.

ఈ సందర్భంగా సత్యదేవ్‌ మాట్లాడుతూ–‘‘ఈ సినిమా వల్ల పృథ్వీ, విశ్వక్‌ అనే ఇద్దరు ప్యాషనేట్‌ నిర్మాతలు ఇండస్ట్రీకి వస్తున్నందుకు హ్యాపీ. మా ట్రైలర్‌ విజువల్స్‌ చూసి పూరీ జగన్నాథ్‌గారు కాల్‌ చేసి కెమెరామ్యాన్‌ ఆదిత్యను అభినందించారు’’ అన్నారు. ‘‘స్కైలాబ్‌ నాకు స్పెషల్‌ మూవీ. ఈ సినిమా నిర్మాణంలో భాగమైనందుకు గర్వంగా ఉంది. విశ్వక్, పృథ్వీ భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేయాలి’’ అన్నారు నిత్యామీనన్‌.

‘‘ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు రాహుల్‌ రామకృష్ణ. ‘‘నిత్యామీనన్, సత్యదేవ్, రాహుల్‌లతో పని చేయడం నా అదృష్టం’’ అన్నారు విశ్వక్‌. ‘‘మానవీయ విలువలే ముఖ్యం అని చెప్పే చిత్రమిది’’ అన్నారు రవికిరణ్‌. ‘‘ఈ చిత్రంతో నిర్మాతగా నేను తొలి అడుగు వేస్తున్నాను’’ అన్నారు పృథ్వీ. ఎడిటర్‌ రవితేజ, కెమెరామ్యాన్‌ ఆదిత్య పాల్గొన్నారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement