Samantha Turns Detective Role For Hollywood Film Chennai Stories - Sakshi
Sakshi News home page

Samantha: గూఢచారిగా సమంత..హాలీవుడ్‌ మూవీ కోసం భారీ కసరత్తు!

May 31 2023 9:38 AM | Updated on May 31 2023 10:20 AM

Samantha Turns Detective For Chennai Stories - Sakshi

డిటెక్టివ్స్‌ బాడీ లాంగ్వేజ్‌ ఎలా ఉంటుంది? వారి ప్రవర్తన ఎలా ఉంటుంది? అనే విషయాలను తెలుసుకుంటున్నారట సమంత. ఎందుకంటే ‘చెన్నై స్టోరీస్‌’ అనే సినిమా కోసం. ఇంగ్లిష్, తమిళ భాషల్లో రూపొందనున్న చిత్రం ఇది. ఇంగ్లాండ్‌ నటుడు వివేక్‌ కల్రా హీరోగా నటించనున్నారు. సమంత హీరోయిన్‌. సినిమాలో ఇంగ్లాండ్‌కి చెందిన కుర్రాడిగా వివేక్, తమిళ యువతి పాత్రలో సమంత కనిపిస్తారు.

తన తల్లి చనిపోయాక, పూర్వీకుల సమాచారం తెలుసుకోవడానికి, దూరమైన తండ్రిని కనుక్కోవడానికి ఇండియా వస్తాడు హీరో. తండ్రి ఆచూకీ తెలుసుకోవడానికి ఓ ప్రైవేట్‌ డిటెక్టివ్‌ని నియమించుకుంటాడు. ఆ గూఢచారి పాత్రనే సమంత చేయనున్నారు. ఇంగ్లాండ్‌కి చెందిన ఆ యువకుడు, చెన్నై పొన్ను (అమ్మాయి) మధ్య ఏర్పడే ప్రేమతో ఈ చిత్రం సాగుతుంది. ‘అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ నవల ఆధారంగా ఫిలిప్‌ జాన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్‌ ఆరంభం కానుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement