Samantha : నాగచైతన్యను సమంత ఇంకా మర్చిపోలేదా? టాటూలే సాక్ష్యమా?

Samantha Still Has Naga Chaitanya Tattoo Chay On Her Rip Photo Viral - Sakshi

సమంత-నాగచైతన్య.. ఒకప్పుడు టాలీవుడ్‌ మోస్ట్‌ బ్యూటిఫుల్‌ కపుల్స్‌గా వీరికి పేరుంది. ఏమాయ చేశావే సినిమాతో తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న చై-సామ్‌లు దాదాపు ఏడేళ్ల పాటు ప్రేమించుకొని 2017లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా 2021లో విడాకులు తీసుకున్నారు. ఇప్పటికీ వీరు కలిసుంటే బావుండు అని కోరుకోని అభిమాని ఉండరు అంటే అతిశయోక్తి కాదు. రీల్‌ లైఫ్‌లోనే కాదు, రియల్‌ లైఫ్‌లోనూ చై-సామ్‌ల జోడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

ఇక విడాకుల తర్వాత ఇద్దరూ సినిమాల పరంగా బిజీబిజీగా గడిపేస్తున్నారు. కస్టడీ సినిమాతో చై ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఇప్పటికే సమంత శాకుంతలం సినిమాతో అభిమానులను పలకరించింది. రీసెంట్‌గా సిటాడెల్‌ ప్రీమియర్‌ షో కోసం లండన్‌ వెళ్లిన సమంత సరికొత్త లుక్‌తో సందడి చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫోటోలు ఎంతగా వైరల్‌ అయ్యాయో అంతకు మించి సమంత ఒంటిపై నాగచైతన్యకు సంబంధించిన టాటూలు కూడా వైరల్‌ అయ్యాయి.

పెళ్లి తర్వాత చై పేరును టాటూ వేయించుకున్న సమంత ఇప్పటికీ ఆ టాటూను చెరపివేయలేదు. 'కొన్ని ఙ్ఞాపకాలను మర్చిపోలేం, టాటూలు కూడా అంతే'.. అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా సమంత మెడపై YMC అని రాసి ఉంటుంది. చైతో తొలిసారి నటించిన ఏ మాయ చేశావే సినిమాకు గుర్తుగా సామ్‌ ఆ టాటూ వేయించుకుంది. ఇక మరో టాటూ ఆమె మణికట్టుపై ఉంటుంది. ఈ మూడు టాటూలు చైతూకి సంబంధించినవే కావడం విశేషం. 


 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top