ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా మేనల్లుడు | Sai Dharam Tej Fulfilled His Promise Helpt To Old Age Home Built | Sakshi
Sakshi News home page

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మెగా మేనల్లుడు

Sep 19 2020 6:12 PM | Updated on Sep 19 2020 6:48 PM

Sai Dharam Tej Fulfilled His Promise Helpt To Old Age Home Built - Sakshi

సినిమాల్లో హీరోలు అనేకం ఉంటారు. కానీ నిజ జీవితంలో హీరోలు మాత్రం కొంతమందే. సాయం అని కోరిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ ఇటీవల రియల్‌ హీరో అనిపించుకున్నారు సోనూసూద్‌. ఈ క్రమలో తాజాగా మరో హీరో ఇచ్చిన మాటలను నిలబెట్టుకొని రియల్‌ హీరో అయ్యారు. అతనే మెగా మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌. ఇంతకీ ఈ సుపప్రీమ్‌ హీరో ఏ మాట నిలబెట్టుకున్నాడని అనుకుంటున్నారా.. గతేడాది విజయవాడలోని ‘అమ్మా ఆదరణ సేవా ఓల్డేజ్ హోమ్’ వారు తమను ఆదుకోవాలని.. ఓల్డేజ్ హోమ్ నిర్మాణానికి ఆర్ధిక సాయం చేయాలని పలువురు సినీ ప్రముఖులను ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్ వేదికగా కోరారు. (‘అమృత ప్రేమలో విరాట్.. మనసులో మాట’)

దీనిపై స్పందించిన సాయి ధరమ్ తేజ్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చాడు. ఇచ్చిన మాట ప్రకారం తేజ్ తన సొంత ఖర్చులతో రెండు అంతస్థుల భవనాన్ని నిర్మించి వృద్దులకు ఓ నీడను కల్పించాడు. అంతేగాక ఒక ఏడాదిపాటు ఆ ఓల్డేజ్‌ హోమ్‌కు స్పాన్సర్‌షిప్‌ అందిసస్తున్నట్లు పేర్కొన్నాడు. అలాగే ఈ మంచి పనిలో తనకు అండగా నిలిచిన అభిమానులందరికీ రుణపడి ఉంటానని సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు. కాగా ఈ హీరో చేసిన పనికి నెజినట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే..ప్రస్తుతం తేజ్‌ సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఇందులో సాయి ధరమ్‌కు జోడిగా ఇస్మార్ట్ భామ నభా నటేష్ నటిస్తున్నారు. ()అమృతను చూశాక విరాట్‌కు ఏమైంది?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement