
RRR Movie New Poster: దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ప్రమోషన్ ప్లానింగ్ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఆయన ప్రమోషన్ స్ట్రాటజీ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుందని బాహుబలితో క్లియర్ గా ప్రూవ్ అయింది. ఇక ఆర్‌ఆర్‌ఆర్ విషయంలో కూడా జక్కన్న సరికొత్త స్ట్రాటజీతో దూసుకెళ్తున్నాడు. కరోనా కారణంగా పలుమార్లు విడుదల వాయిదా పడిన ఆర్‌ఆర్‌ఆర్ ఎట్టకేలకు మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో మళ్లీ ప్రమోషన్స్ స్పీడ్ పెట్టేశాడు రాజమౌళి.
మహా శివరాత్రి సందర్భంగా ఆర్‌ఆర్‌ఆర్ మార్చ్ అంటూ ఓ స్నాప్ షాట్ విడుదల చేశారు. ఇందులో మీకు ఇష్టమైన ఇమేజ్ పెట్టుకొని సోషల్ మీడియా వాల్స్‌పై పోస్ట్ చేసుకోండి అంటూ ఈ స్నాప్ షాట్‌ని వదిలారు. ఇంకేముంది నెటిజన్స్ అంతా ఆర్‌ఆర్‌ఆర్ స్పాప్ షాట్‌పై పడ్డారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్లేసుల్లో తమ తమ ఫోటోలను పెట్టుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో మరోసారి ఆర్‌ఆర్‌ఆర్ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లోకి వచ్చింది.
MaRRRching towards the 25th!! 🐎🏍 #RRRMovie
— RRR Movie (@RRRMovie) March 1, 2022
Click a snap and slide for ‘MARRRCH IS HERE’ sticker on Snapchat across India🇮🇳
Share it to your streak partners and post your snaps on your walls with #MaRRRchIsHere 🔥🌊
Official Page - https://t.co/XEbPumhUX3 pic.twitter.com/1godorVAqt