శ్రీవారి సేవలో రీతు చౌదరి, విష్ణుప్రియ

ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని బుల్లితెర యాంకర్ విష్ణుప్రియ, జబర్దస్త్ ఆర్టిస్ట్ రీతు చౌదరిలు గురువారం సందర్శించారు. స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. వారికి ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం కొండపైన గజ, గోసంరక్షణ శాలలను వారు సందర్శించారు. గజలక్ష్మి (ఏనుగు)తో ఫొటోలు దిగి సందడి చేశారు.