‘పచ్చీస్‌’ ట్రైలర్‌ను రిలీజ్‌ చేసిన రానా

Rana Launches Pachchis Movie Trailer   - Sakshi

టాలీవుడ్‌ సెలబ్రిటీ డిజైనర్‌ రామ్స్‌ హీరోగా నటించిన తొలి చిత్రం ‘పచ్చీస్‌’. ఇందులో శ్వేతా వర్మ హీరోయిన్‌గా నటించారు. శ్రీ కృష్ణ, రామసాయి సంయుక్త దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కౌశిక్‌ కుమార్‌ కొత్తూరి, రామసాయి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ అమెజాన్‌లో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను హీరో రానా విడుదల చేశారు. జీవితంలో పైకి రావాలనుకునే ఓ యువకుడు అనుకోకుండా ఓ క్రైమ్‌లో చిక్కుకున్నప్పుడు అతని జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనే కథనంతో ఈ క్రైమ్‌ థ్రిల్లర్‌ రూపొందింది. జయచంద్ర, రవివర్మ, కేశవ్‌ దీపక్, ధ్యాన్‌చంద్‌ రెడ్డి, శుభలేఖ సుధాకర్‌ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సహనిర్మాత: పుష్పక్‌ జైన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: దినేష్‌ యాదవ్‌ బొల్లేబోయిన.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top